భారత దిగ్గజ స్ప్రింటర్ మిల్కా సింగ్(Milkha Singh) మృతికి సంతాపం ప్రకటించారు టీమ్ఇండియా ఆటగాళ్లు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) సందర్భంగా జాతీయ గీతం పాడిన భారత ఆటగాళ్లు.. చేతులకు నల్లరిబ్బన్లను ధరించారు.
-
#WTCFinal21🏏: The Indian Cricket Team is wearing black armbands in remembrance of #MilkhaSingh.#INDvNZ pic.twitter.com/4Wsjv5nkv5
— All India Radio News (@airnewsalerts) June 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WTCFinal21🏏: The Indian Cricket Team is wearing black armbands in remembrance of #MilkhaSingh.#INDvNZ pic.twitter.com/4Wsjv5nkv5
— All India Radio News (@airnewsalerts) June 19, 2021#WTCFinal21🏏: The Indian Cricket Team is wearing black armbands in remembrance of #MilkhaSingh.#INDvNZ pic.twitter.com/4Wsjv5nkv5
— All India Radio News (@airnewsalerts) June 19, 2021
గత రెండు నెలలుగా కొవిడ్‌తో బాధపడుతున్న మిల్కా సింగ్ ఇటీవల మహమ్మారి నుంచి కోలుకున్నారు. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా తీవ్ర జ్వరంతో పాటు ఆక్సిజన్ స్థాయిలు పడిపోయాయి. దీంతో రాత్రి 11.30 సమయంలో ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా బాధపడుతూ ఆయన భార్య నిర్మలా కౌర్ గత ఆదివారం కన్నుమూశారు.
మిల్కా సింగ్ ఘనతలు..
- దేశ విభజన సమయంలో కుటుంబం మొత్తం కళ్ల ముందే ఊచకోత.. పాకిస్థాన్ నుంచి కట్టుబట్టలతో భారత్‌కు రాక.. టీనేజీలో దొంగగా ముద్ర.. సీన్ కట్ చేస్తే.. ఆయనో పరుగుల వీరుడు.. 400 మీటర్ల రేసులో ప్రపంచ రికార్డు.. ఫ్లయింగ్ సిక్కు అంటూ పాకిస్థాన్ రాష్ట్రపతి చేత ప్రశంసలు అందుకున్నారు.
- 1929 నవంబరు 20న పంజాబ్‌లోని గోవిందపురా(ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉంది)లో జన్మించారు మిల్కా సింగ్. టీనేజీలో పాకిస్థాన్ నుంచి వలసవచ్చిన మిల్కా.. శరణార్థుల శిబిరంలో తలదాచుకున్నారు. అనంతరం భారత సైనిక దళంలో చేరి.. ఫీల్డ్ అండ్ ట్రాక్ ఈవెంట్లో తానేంటో నిరూపించుకున్నారు.
- 1958 ఆసియా క్రీడల్లో పాల్గొని 200 మీటర్ల విభాగంలో స్వర్ణం నెగ్గారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతకుముందే 400 మీటర్ల విభాగంలో జాతీయ రికార్డు నమోదు చేసిన ఆయన.. 1956 విశ్వక్రీడలకు అర్హత సాధించారు. అయితే ఈ పోటీల్లో అంతగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం 1958లో జరిగిన ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గి ప్రపంచ వేదికపై భారత్ జెండాను ఎగురవేశారు.
- 1960 రోమ్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకం చేజార్చుకున్నారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో మళ్లీ సత్తాచాటారు. 400మీటర్లు, 4X400 మీటర్ల రిలేలో పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడల్లో మిల్కా సింగ్ కృషికిగాను 1959లో భారత ప్రభుత్వం.. పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
- 400 మీటర్ల రేసులో మిల్కా సింగ్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. అప్పటివరకున్న 45.9 సెకన్ల రికార్డు బ్రేక్ చేస్తూ, కొత్త టైమింగ్‌ను(45.8 )నెలకొల్పారు. జాతీయ స్థాయిలో ఈ రికార్డును 2006 వరకు ఎవరూ బ్రేక్ చేయలేకపోవడం విశేషం.
- మిల్కాసింగ్ జీవితం ఆధారంగా బాలీవుడ్లో 'భాగ్ మిల్కా భాగ్' చిత్రాన్ని రూపొందించారు. 2013లో విడుదలైందీ సినిమా. ఇందులో ఫర్హాన్ అక్తర్.. మిల్కా పాత్ర పోషించారు. ఇందులోని పాత్రకుగాను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడిగా నిలిచాడు ఫర్హాన్. పలు అవార్డులనూ అందుకుందీ చిత్రం.
ఇదీ చదవండి: కరోనాతో మిల్కాసింగ్ భార్య నిర్మలా కౌర్ మృతి