శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్ఇండియా అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్... నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగులు చేసింది. లంక బౌలర్లకు చుక్కలు చూపించారు టీమ్ఇండియా బ్యాటర్లు. విరాట్ కోహ్లీ పంజా విసిరాడు. 110 బంతుల్లో చెలరేగి ఆడి 166 పరుగుల చేశాడు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ 116 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (49), శ్రేయస్ అయ్యర్(38) రాణించారు. కేఎల్ రాహుల్ (7) పరుగులకే పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్(5), అక్షర్ పటేల్(2) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార (2) వికెట్లు తీయగా.. కసున్ రజిత(2), చమిక కరుణరత్నే (1) వికెట్ పడగొట్టారు.
భారీ శతకంతో గర్జించిన కోహ్లీ.. గిల్ సూపర్ సెంచరీ.. లంకకు భారీ లక్ష్యం - భారత్ వర్సెస్ శ్రీలంక వన్డే సిరీస్ హైలైట్స్
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. లంకకు 391 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు.