ETV Bharat / sports

సౌతాఫ్రికాతో టీమ్ఇండియా సవాలు - ప్రత్యర్థులతో ప్రమాదమే! - భారత్ వర్సెస్ సౌతాఫ్రికా టీ20 వేదిక

India Vs South Africa T20 : ఆస్ట్రేలియాపై తమ సత్తా చాటి దూసుకెళ్లిన టీమ్ఇండియా ఇప్పుడు సౌతాఫ్రితకాతో తలపడనుంది. ఇందులోభాగంగా ఆదివారం కింగ్స్​మీడ్​ క్రికెట్​ స్టేడియంలో సఫారీలతో సై అనేందుకు భారత జట్టు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటి వరకు ఎలా ఆడాయంటే

India Vs  South Africa T20
India Vs South Africa T20
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 7:21 AM IST

India Vs South Africa T20 : ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో ఓడించింది. న్యూజిలాండ్‌ను కూడా ఆ దేశంలోనే మట్టికరిపించింది. ఇక ఆస్ట్రేలియా గడ్డపైనా పైచేయి సాధించింది. కానీ సౌతాఫ్రికాలో మాత్రం ఇప్పటివరకూ టెస్టు సిరీస్‌ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలకాలంటూ టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనూ గెలుపొందాలన్న లక్ష్యంతో టీమ్‌ఇండియా మైదానంలో అడుగుపెట్టింది. ఆదివారం ప్రారంభం కానున్న టీ20తో తమ సత్తా చూపించేందుకు సిద్ధమైంది.

ఆ ఫార్మాట్​లో ఒక్కసారే
వన్డే ఫార్మాట్లో సౌతాఫ్రికాలో ఆ జట్టుపై భారత్‌ ఒక్కసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. ఈ రెండు జట్లు అక్కడ ఆరు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడ్డాయి. అయితే 2018లో జరిగిన ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత జట్టు 5-1తో విజయ తీరాలకు చేరింది. రన్నింగ్ మెషిన్ విరాట్ కోహ్లి సారథ్యంలోని ఆ జట్టు అన్ని విభాగాల్లోనూ రాణించి ప్రత్యర్థులను దాని గడ్డపైనే దెబ్బకొట్టింది. ఇక టీ20ల విషయానికి వస్తే భారత్‌దే పైచేయిగా నిలిచింది. 2018లోనే మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమ్‌ఇండియా 2-1తో కైవసం చేసుకుంది. అంతకంటే ముందు 2006, 2011లో ఏకైక టీ20 మ్యాచ్‌ల్లో సఫారీలను ఓడించింది. 2012లో ఓ టీ20లో భారత్‌ ఓడింది.

అయితే సౌతాఫ్రికాలో టెస్టు సిరీస్‌ విజయం మాత్రం భారత్‌కు అందని ద్రాక్షగానే ఉంది. ఇప్పటివరకూ ఆ గడ్డపై టీమ్‌ఇండియా కేవలం ఎనిమిది టెస్టు సిరీస్‌లు మాత్రమే ఆడింది. కానీ ఒక్కసారి కూడా భారత్​ విజేతగా నిలవలేకపోయింది. 1992-93లో అజహరుద్దీన్‌ సారథ్యంలో తొలిసారి దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత జట్టు వెళ్లింది. అయితే అప్పుడు నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్​ఇండియా 0-1తో ఓటమిపాలైంది. ఇక 1996-97లో సచిన్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌లో సిరీస్‌ను 0-2తో కోల్పోయింది.

మరోవైపు 2001లో సౌరభ్‌ గంగూలీ సారథ్యంలో భారత్‌ రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో చేజార్చుకుంది. 2006-07లో (ద్రవిడ్‌ కెప్టెన్‌) 1-2తో, 2013లో (ధోని కెప్టెన్‌) 0-1తో పరాజయం పాలైంది. ఇక కోహ్లి కెప్టెన్సీలో 2018, 2021-22లో 1-2తో భారత జట్టు ఓటమిని చవి చూసింది. 2010-11లో ధోని సారథ్యంలో సిరీస్‌ గెలిచేందుకు జట్టుకు మంచి అవకాశమే వచ్చింది. కానీ చివరి టెస్టు డ్రా కావడం వల్ల మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ 1-1తో ముగించింది.

ప్రత్యర్థులతో ప్రమాదమే
ఈ సారి కూడా సౌతాఫ్రికాతో భారత్‌కు కఠిన పరీక్ష తప్పదు. ఈ మూడు ఫార్మాట్లలోనూ ప్రత్యర్థి జట్టు ప్రమాదకరంగా ఉంది. విధ్వంసక ఆటగాళ్లందరూ ఆ జట్టులోనే ఉన్నారు. ఇటీవలే జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు దూకుడుగానే ఆడింది. చాలా మ్యాచుల్లోనూ అలవోకగా 350కి పైగా పరుగులు స్కోర్ చేసింది. కానీ సెమీస్‌లో ఆ జట్టు ఓడిపోయింది. అయితే ఇప్పుడు భారత్‌పైనా జోరు కొనసాగించేందుకు సఫారీ జట్టు సిద్ధమైంది. పరిమిత ఓవర్ల సిరీస్‌కు బవుమా విశ్రాంతి తీసుకోవడం వల్ల టీ20 కెప్టెన్‌ మార్‌క్రమ్‌ వన్డేలకూ సారథిగా వ్యవహరించనున్నాడు.

అతడితో పాటు రీజా హెండ్రిక్స్‌, క్లాసెన్‌, స్టబ్స్‌, మిల్లర్‌, ఫెలుక్వాయో, జాన్సన్‌, కొయెట్జీ, కేశవ్‌ మహరాజ్‌, షంసీ, ఎంగిడితో టీ20 జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. వన్డేల్లో నిలకడగా రాణించే వాండర్‌ డసెన్‌ కూడా జట్టుతో చేరతాడు. టెస్టుల్లో ఎల్గర్‌, బవుమా, రబాడ కూడా తోడవడంతో ఆ జట్టు మరింత బలంగా మారనుంది. పైగా అక్కడి పరిస్థితులు మనకు సవాలు విసిరేవే. ఈ నేపథ్యంలో మూడు ఫార్మాట్లలోనూ సిరీస్‌ విజయాలు అందుకోవాలంటే ఇక టీమ్‌ఇండియా శక్తికి మంచి పోరాడాల్సి ఉంటుంది.

ఉమ్రాన్​ను పక్కకు పెట్టడంపై మాజీ ఆల్​రౌండర్​ అసంతృప్తి - 'అతడి విషయంలో నా అంచనాలు తప్పాయి'

భారత్​ X సౌతాఫ్రికా టూర్ - రానున్న టోర్నీలో ఈ ప్లేయర్లదే హవా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.