ETV Bharat / sports

WTC Final: మూడోరోజు ఆట కష్టమేనా?

వరల్డ్ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ సజావుగా సాగేలా కనిపించడం లేదు. సౌథాంప్టన్​లో మూడోరోజు కూడా వర్షం పడటం వల్ల మ్యాచ్​ తొలి సెషల్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

India vs New Zealand WTC Final: Mostly cloudy but showers expected on Day 3 at Rose Bowl
కోహ్లీ
author img

By

Published : Jun 20, 2021, 1:48 PM IST

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడం వల్ల శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ కుదర్లేదు. మూడో రోజైన ఆదివారమూ పరిస్థితులు మెరుగ్గా ఏం కనిపించట్లేదు.

సౌథాంప్టన్‌ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం మేఘావృతమైంది. ఈ లెక్కన తొలిసెషన్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మధ్యాహ్నం సైతం 80% వరకు వర్షం కురుస్తుందని వాతావరణ వెబ్‌సైట్లు అంచనా వేశాయి. 'ఉదయం భారీ వర్షం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత తగ్గొచ్చు. అప్పుడప్పుడు ఎండ వస్తుంది. సాయంత్రానికి వాతావరణం పొడిగా మారే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది' అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది.

Rose Bowl
సౌథాంప్టన్ మైదానం

మొదటి రోజు ఆట రద్దు కావడం వల్ల రెండోరోజు టాస్‌ వేశారు. టాస్ గెలిచిన విలియమ్సన్‌.. భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వెలుతురు లేమితో ఆట ముగించే సరికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44*) అర్ధశతకానికి చేరువయ్యాడు. అజింక్య రహానె (29*) అతడికి తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ 147 బంతుల్లో 58 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్‌ శర్మ (34), శుభ్‌మన్‌ గిల్‌ (28) ఫర్వాలేదనిపించారు. మొత్తంగా 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.