ETV Bharat / sports

కెమెరా వల్ల ఆగిన మ్యాచ్​.. కోహ్లీ ఫన్నీ రియాక్షన్ - కోహ్లీ ఫన్నీ రియాక్షన్

India vs New Zealand 2ndTest: టీమ్​ఇండియా, న్యూజిలాండ్ రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్​లో ఓ ఫన్నీ సంఘటన జరిగింది. స్పైడర్​క్యామ్​ పనిచేయడం ఆగిపోయింది. ఆ సమయంలో కోహ్లీ, సూర్యకుమార్​ కెమెరాలో ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం వైరల్​గా మారింది.

kohli, surya kumar yadav
కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్
author img

By

Published : Dec 5, 2021, 6:19 PM IST

India vs New Zealand 2ndTest : న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా మూడో రోజు ఇన్నింగ్స్​లో స్పైడర్​ క్యామ్​ కారణంగా మ్యాచ్​కు అంతరాయం ఏర్పడింది. ముంబయి వాంఖడే స్టేడియంలో టీ బ్రేక్​ సమయానికి కొన్ని ఓవర్లు మిగిలుండగానే ఈ సంఘటన జరిగింది. పిచ్​కు కొంచెం ఎత్తులోనే క్యామ్​ ఆగిపోవడం వల్ల ముందుగానే టీ బ్రేక్​ తీసుకోవాల్సి వచ్చింది.

అయితే.. స్పైడర్ క్యామ్​ ఆగిపోయిన సమయంలో టీమ్​ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ రియాక్షన్ అందులో రికార్డు అయింది. ​ స్పిన్నర్ రవిచంద్రన్​ అశ్విన్, యువ బ్యాటర్ శ్రేయస్​ అయ్యర్​ కూడా స్పైడర్​ కెమెరాతో కామెడీ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్​గా మారాయి.

టీమ్​ఇండియా సారథి విరాట్ కోహ్లీ.. కెమెరా దగ్గరకు వచ్చి పైకి వెళ్లమని చెప్పడం. సూర్యకుమార్​ యాదవ్ క్లోజప్ నవ్వులు పూయిస్తోంది.

మ్యాచ్​ విషయానికొస్తే.. భారత బౌలర్ల ధాటికి కివీస్​ బ్యాటర్లు తడబడుతున్నారు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ కివీస్​ బోర్డును పరుగెత్తించడంలో విఫలమవుతున్నారు. ప్రస్తుతం 129 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది న్యూజిలాండ్.

ఇదీ చదవండి:

భారీ ఆధిక్యంతో టీమ్​ఇండియా డిక్లేర్.. కివీస్ 13/1

Shikhar Dhawan mimics Rohit: రోహిత్​ను ఇమిటేట్ చేసిన ధావన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.