ETV Bharat / sports

హార్దిక్​ ఆల్​రౌండ్​ షో.. తొలి టీ20లో టీమ్​ఇండియా ఘన​ విజయం

IND Vs ENG T20: ఆహా హార్దిక్‌ పాండ్య! కోల్పోయిన 'ఆల్‌రౌండర్‌' హోదాను తిరిగి అందుకుంటూ ఈ ఏడాది ఐపీఎల్‌లో అదరగొట్టిన ఈ స్టార్‌ ఆటగాడు.. అంతర్జాతీయ క్రికెట్లోనూ అదే స్థాయిలో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లో అతను బ్యాటుతో చెలరేగి, బంతితో విజృంభించాడు. మిగతా ఆటగాళ్లు కూడా అతడికి సహకారం అందించడంతో తొలి టీ20లో భారత్‌.. 50 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది.

india-vs-england-first-20-india-won-by-50-runs

author img

By

Published : Jul 8, 2022, 6:34 AM IST

IND Vs ENG T20: హార్దిక్‌ పాండ్య ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టడం వల్ల ఇంగ్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్‌ను టీమ్‌ఇండియా ఘనంగా ఆరంభించింది. గురువారం తొలి టీ20లో భారత్‌ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. హార్దిక్‌ పాండ్య (51) సూర్యకుమార్‌ యాదవ్‌ (39), దీపక్‌ హుడా (33) మెరుపులతో 8 వికెట్ల నష్టానికి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ (2/23), మొయిన్‌ అలీ (2/26) సత్తా చాటారు.

అనంతరం హార్దిక్‌ (4/33) బంతితోనూ విజృంభించడం.. చాహల్‌ (2/32), అర్ష్‌దీప్‌ సింగ్‌ (2/18), భువనేశ్వర్‌ (1/10) కూడా రాణించడంతో ఇంగ్లాండ్‌ 19.3 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. మొయిన్‌ అలీ (36; 20 బంతుల్లో 4X4, 26), హ్యారీ బ్రూక్‌ (28; 23 బంతుల్లో 2X4, 1X6) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. భువి తొలి ఓవర్లోనే కెప్టెన్‌ బట్లర్‌ (0)ను బౌల్డ్‌ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బ కొట్టగా.. ఆ తర్వాత మలన్‌ (21), లివింగ్‌స్టోన్‌ (0), జేసన్‌ రాయ్‌ (4)లను పెవిలియన్‌ చేర్చిన హార్దిక్‌ మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పాడు. బ్రూక్‌, మొయిన్‌ల పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగపడింది. వీళ్లిద్దరినీ చాహల్‌.. ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చడంతో ఇంగ్లాండ్‌ పనైపోయింది.

వన
.

మెరుపులే.. మెరుపులు
మ్యాచ్‌కు వేదికైన రోజ్‌బౌల్‌ మైదానంలో ఇటీవల ఎక్కువగా రెండోసారి బ్యాటింగ్‌ చేసిన జట్లే గెలవడంతో టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా అందుకే మొగ్గు చూపాడు. తన నిర్ణయానికి న్యాయం చేస్తూ రోహిత్‌ (24; 14 బంతుల్లో 54) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును ముందుండి నడిపించాడు. సామ్‌ కరన్‌ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ముందుకొచ్చి బలమైన షాట్‌తో బౌండరీ కొట్టి తన ఉద్దేశాన్ని చాటాడు. టాప్లీ వేసిన రెండో ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్‌.. మొయిన్‌ అలీకి కూడా అదే శిక్ష వేశాడు. కానీ ఇంకో షాట్‌ ఆడబోయి బంతి ఎడ్జ్‌ తీసుకోవడంతో వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. మొయిన్‌ తన తర్వాతి ఓవర్లో ఇషాన్‌ కిషన్‌ (8)ను కూడా ఔట్‌ చేశాడు. కానీ అంతకంటే ముందు దీపక్‌ హుడా అతడి బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత కూడా అతను జోరు కొనసాగించడంతో పవర్‌ ప్లే ముగిసేసరికే భారత్‌ 66 పరుగులు చేసింది.

ఇక్కడి నుంచి బాదుడు బాధ్యత సూర్యకుమార్‌ తీసుకున్నాడు. హుడాను జోర్డాన్‌ పెవిలియన్‌ చేర్చినా.. సూర్య చెలరేగి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. హార్దిక్‌ కూడా ఆరంభం నుంచే ధాటిగా ఆడడంతో భారత్‌ పదో ఓవర్లోనే 100 దాటింది. అయితే మంచి ఊపుమీదున్న సూర్యకుమార్‌ను జోర్డాన్‌ ఔట్‌ చేయడంతో స్కోరు వేగం కాస్త తగ్గింది. అక్షర్‌ పటేల్‌ (17) అనుకున్నంత వేగంగా ఆడలేకపోయాడు. హార్దిక్‌ కూడా జోరు తగ్గించడంతో 14-16 మధ్య 3 ఓవర్లలో 24 పరుగులే వచ్చాయి. హార్దిక్‌ తర్వాత జోరు పెంచినా.. అతడిని టాప్లీ ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ కొట్టాడు. కార్తీక్‌ (11) రెండు ఫోర్లు కొట్టి వెనుదిరిగాడు. ఓ దశలో 220 దాటేలా కనిపించిన భారత్‌.. చివరికి 198 పరుగులతో సరిపెట్టుకుంది. ఈ మ్యాచ్‌తో భారత యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో పంజాబ్‌ తరఫున కొన్ని సీజన్ల నుంచి నిలకడగా రాణిస్తున్న అతడిని సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో టీ20లకు ఎంపిక చేసినప్పటికీ.. ఆ సిరీస్‌తో పాటు ఐర్లాండ్‌తో రెండు టీ20లకు కూడా తుది జట్టులో చోటివ్వలేదు.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బట్లర్‌ (బి) అలీ 24; ఇషాన్‌ కిషన్‌ (సి) పార్కిన్సన్‌ (బి) అలీ 8; దీపక్‌ హుడా (సి) మిల్స్‌ (బి) జోర్డాన్‌ 33; సూర్యకుమార్‌ (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 39; హార్దిక్‌ పాండ్య (సి) బ్రూక్‌ (బి) టాప్లీ 51; అక్షర్‌ (సి) రాయ్‌ (బి) పార్కిన్సన్‌ 17; దినేశ్‌ కార్తీక్‌ (సి) సామ్‌ కరన్‌ (బి) మిల్స్‌ 11; హర్షల్‌ పటేల్‌ రనౌట్‌ 3; భువనేశ్వర్‌ నాటౌట్‌ 1; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 198; వికెట్ల పతనం: 1-29, 2-46, 3-89, 4-126, 5-171, 6-180, 7-195, 8-195; బౌలింగ్‌: సామ్‌ కరన్‌ 2-0-18-0; టాప్లీ 4-0-34-1; మొయిన్‌ అలీ 2-0-26-2; మిల్స్‌ 3-0-35-1; పార్కిన్సన్‌ 4-0-44-1; జోర్డాన్‌ 4-0-23-2; లివింగ్‌స్టోన్‌ 1-0-15-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి) హర్షల్‌ (బి) హార్దిక్‌ 4; బట్లర్‌ (బి) భువనేశ్వర్‌ 0; మలన్‌ (బి) హార్దిక్‌ 21; లివింగ్‌స్టోన్‌ (సి) కార్తీక్‌ (బి) హార్దిక్‌ 0; బ్రూక్‌ (సి) సూర్యకుమార్‌ (బి) చాహల్‌ 28; మొయిన్‌ అలీ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) చాహల్‌ 36; సామ్‌ కరన్‌ (సి) కార్తీక్‌ (బి) హార్దిక్‌ 4; జోర్డాన్‌ నాటౌట్‌ 26; మిల్స్‌ (సి) అండ్‌ (బి) హర్షల్‌ 7; టాప్లీ (సి) కార్తీక్‌ (బి) అర్ష్‌దీప్‌ 9; పార్కిన్సన్‌ (సి) హుడా (బి) అర్ష్‌దీప్‌ 0; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 148, వికెట్ల పతనం: 1-1, 2-27, 3-29, 4-33, 5-94, 6-100, 7-106, 8-120, 9-135, బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-10-1; అర్ష్‌దీప్‌ 3.3-1-18-2; హార్దిక్‌ 4-0-33-4; హర్షల్‌ 3-0-24-1; చాహల్‌ 4-0-32-2; అక్షర్‌ 2-0-23-0

ఇవీ చదవండి: టీ20 వరల్డ్​కప్​కు ముందే భారత్​- పాక్​ ఢీ.. రివెంజ్​కు ఛాన్స్!

Malaysia Masters: క్వార్టర్​ ఫైనల్స్​కు దూసుకెళ్లిన పీవీ సింధు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.