India under-19 world cup: అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌కు యువ భారత్ సిద్ధమైంది. వెస్టిండీస్‌లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా శనివారం, ఇంగ్లాండ్‌తో యష్ ధూల్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
ఇప్పటికే రికార్డుస్థాయిలో నాలుగుసార్లు అండర్-19 ప్రపంచకప్‌ను ఒడిసిపట్టిన యువ భారత్.. మరోసారి కప్పు కొట్టాలని ఉవ్విళ్లూరుతోంది.
బ్యాటింగ్‌లో కెప్టెన్ యష్ ధూల్, వైస్‌కెప్టెన్ రషీద్ ఫామ్‌లో ఉండడం.. బౌలింగ్‌లో రవి కుమార్, విక్కీ రాణిస్తుండడం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. ఒత్తిడిని అధిగమిస్తే భారత విజయం సాధించడం కష్టం కాదని మాజీలు అంటున్నారు.
ఇటు ఇంగ్లాండ్ కూడా ప్రపంచకప్ కలను మరోసారి సాకారం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. 1998 తర్వాత ఫైనల్‌కు చేరిన ఆ జట్టు.. భారత్‌లాగే ఈ టోర్నీలో ఇంతవరకూ ఒక్క మ్యాచ్‌కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్‌లో సారధి టామ్ పెర్స్ట్ మంచి ఫామ్‌లో ఉండగా, పేసర్ జాషువా బోడెన్ 13 వికెట్లతో సత్తా చాటుతున్నాడు. వీరిద్దరూ మరోసారి రాణిస్తే యువ భారత జట్టుకు కష్టాలు తప్పవు.
మరోవైపు ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ భారత యువ ఆటగాళ్లతో వీడియో కాల్‌లో మాట్లాడి ధైర్యాన్ని నింపాడు. ఒత్తిడిని అధిగమించి అత్యుత్తమంగా ఆడాలని కోహ్లీ విజయ మంత్రాన్ని అందించాడు.
ఇవీ చదవండి: