ETV Bharat / sports

జడేజా విశ్వరూపం.. ఆసీస్​ ఆలౌట్​.. భారత్​ లక్ష్యం ఎంతంటే?

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న రెండో టెస్ట్​.. రెండో ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లు సత్తా చాటారు. రెండో ఇన్నింగ్స్‌లో ఓవర్‌ నైట్‌ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. టీమ్‌ఇండియా స్పిన్నర్ల ధాటికి చిగురుటాకులా వణికిపోయి 113 పరుగులకు ఆలౌటైంది.

india vs australia second test updates
india vs australia second test updates
author img

By

Published : Feb 19, 2023, 11:11 AM IST

Updated : Feb 19, 2023, 11:37 AM IST

భారత స్పిన్‌ మాయాజాలానికి మరోసారి ఆసీస్‌ కుప్పకూలింది. బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో బాగంగా దిల్లీలో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 113 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. భారత బౌలర్‌ జడేజా విశ్వరూపం చూపాడు. ఏకంగా 7 వికెట్లను పడొగొట్టాడు. అశ్విన్‌ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఒక్క పరుగు ఆధిక్యంలో ఉంది. తాజాగా 113 పరుగులకు ఆలౌట్‌ కావడంతో భారత్‌ ముందు 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్‌ ఉంచినట్లయింది.

ఓవర్‌ నైట్‌ స్కోరు 61/1తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌కు ఆదిలోనే షాక్​ ఎదురైంది. పెనర్‌ ట్రెవిస్‌ హెడ్‌ను అశ్విన్‌ పెవిలియన్‌కు పంపాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్‌ హెడ్‌ వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 85 పరుగుల వద్ద ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన స్మిత్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో లబుషేన్‌ క్లీన్‌ బౌల్డ్‌ కాగా.. అశ్విన్‌ బౌలింగ్‌లో మాట్‌ రెన్‌ షా ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుసగా బ్యాటర్లు చేతులెత్తేశారు. 95 పరుగుల వద్ద ఒక్క పరుగు కూడా చేయకుండా.. నలుగురు ఆసీస్​ బ్యాటర్లు పెవిలియన్​కు చేరారు. అప్పటికే ఏడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత 24 ఓవర్‌లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్‌ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. జడేజా విశ్వరూపంతో ఆస్ట్రేలియా ఆలౌట్​ అయింది.

Last Updated : Feb 19, 2023, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.