ETV Bharat / sports

కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్ .. అభిమానులు ఫుల్​ ఖుష్​! - తొలిటెస్టు

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలిటెస్టు రెండోరోజు మ్యాచ్​లో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ అద్భుతం చేశాడు. రవిచంద్రన్​ అశ్విన్ బౌలింగ్​లో ఆసీస్​ ఆటగాడు కామెరూన్​ గ్రీన్​ బాదిన బంతిని చాకచక్యంగా పట్టుకున్నాడు.

team india captain virat kohli takes stunning catch in day night match with australia
విరాట్​ కోహ్లీ క్యాచ్​.. అభిమానులు ఫుల్​ ఖుష్​!
author img

By

Published : Dec 18, 2020, 3:53 PM IST

టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ తన సత్తా ఏంటో మరోసారి నిరూపించుకున్నాడు. అడిలైడ్​ వేదికగా జరుగుతోన్న తొలిటెస్టు రెండో రోజు ఆటలో.. ఓ అద్భుతమైన క్యాచ్​ను పట్టి అదరహో అనిపించాడు. రవి చంద్రన్​ అశ్విన్​ బౌలింగ్​లో ఓ భారీ షాట్​ను ఆడేందుకు ప్రయత్నించాడు కామెరూన్​ గ్రీన్​. అయితే.. అనూహ్యంగా ఆ బంతిని టీమ్​ఇండియా సారథి విరాట్​ కోహ్లీ.. డైవ్​ చేసి పట్టుకున్నాడు. భారత ఆటగాళ్లు అంతకుముందు పలు సులభమైన క్యాచ్​లను వదిలేయగా.. కోహ్లీ ఈ క్యాచ్​ పట్టుకోవడం విశేషం. భారీ అంచనాలతో బరిలోకి దిగిన గ్రీన్​.. ఈ విధంగా పెవిలియన్​కు చేరడం.. కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం.

పరిమిత ఓవర్ల సిరీస్​లో విమర్శలు ఎదుర్కొన్న కోహ్లీ ఈ అద్భుత ప్రదర్శనతో తానేంటో చాటి చెప్పాడు. దీనిపై నెటిజన్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. విమానం కాదు, పక్షి కాదు, అతడు విరాట్​ కోహ్లీ అంటూ తెగ మురిసిపోతున్నారు. కోహ్లీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మ్యాచ్​లో అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. స్మిత్‌ (1)ను తన తొలి ఓవర్‌లోనే ఔట్ చేసిన అతడు.. తర్వాత ట్రెవిస్‌ హెడ్‌ (7) పెవిలియన్​కు చేర్చాడు. ఆ తర్వాత కామెరూన్‌ గ్రీన్‌(11)ను ఔట్​ చేసి ఆసీస్‌ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో టీ బ్రేక్​ సమయానికి ఆసీస్​ జట్టు.. 92/5తో నిలిచింది.

ఇదీ చూడండి:సిడ్నీలో కరోనా కేసులు.. మూడో టెస్టుపై నీలినీడలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.