ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా ఆటగాళ్లకు కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్‌గా తేలింది. దీంతో శిక్షణా శిబిరాన్ని ప్రారంభించారు. జట్టులో తొలిసారి చోటు సంపాదించుకున్న బౌలర్ టి. నటరాజన్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ కనపడ్డాడు. ఆ వీడియోను బీసీసీఐ షేర్ చేసింది. 'కలనిజమైన వేళ' అని రాసుకొచ్చింది.
-
We have seen him bowl with a lot of success in the @IPL and here is @Natarajan_91 bowling in the #TeamIndia nets for the first time after his maiden India call-up! A dream come true moment. 👏 pic.twitter.com/WqrPI0Ab7I
— BCCI (@BCCI) November 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">We have seen him bowl with a lot of success in the @IPL and here is @Natarajan_91 bowling in the #TeamIndia nets for the first time after his maiden India call-up! A dream come true moment. 👏 pic.twitter.com/WqrPI0Ab7I
— BCCI (@BCCI) November 15, 2020We have seen him bowl with a lot of success in the @IPL and here is @Natarajan_91 bowling in the #TeamIndia nets for the first time after his maiden India call-up! A dream come true moment. 👏 pic.twitter.com/WqrPI0Ab7I
— BCCI (@BCCI) November 15, 2020
"ఐపీఎల్లో విజయవంతంగా బౌలింగ్ చేసిన నటరాజన్‌ను మనం చూశాం. టీమ్ఇండియాలో చోటు సంపాదించుకున్న నటరాజన్.. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. కల నిజమైన వేళ ఇది."
--బీసీసీఐ
యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్.. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 16 వికెట్లను తీసి అనేకసార్లు ఆ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. రెండో క్వాలిఫయర్ వరకు ఆ జట్టు చేరుకోవడంలో అండగా నిలిచాడు.
బౌలర్ వరుణ్ చక్రవర్తి గాయం కారణంగా.. ఆస్ట్రేలియా పర్యటనలో చోటు సంపాదించాడు నటరాజన్. ఈ పర్యటనలో భాగంగా.. భారత్-ఆసిస్ మధ్య నవంబరు 27 నుంచి జనవరి 19 వరకు మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు జరగనున్నాయి.
ఇవీ చూడండి: