టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మకు గాయం అయిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నారు. ముంబయి జట్టు కోసం రోహిత్ ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్‌గా మారటం వల్ల ఈ వ్యాఖ్యలు చేశారు గావస్కర్.
" రోహిత్ ప్రాక్టీస్ చేస్తుంటే అతనికి ఎలాంటి గాయం అయ్యిందో అర్థం కావట్లేదు. నిజంగానే అతనికి తీవ్రమైన గాయం ఉంటే అసలు బ్యాట్ పట్టుకునేవాడే కాదు. రోహిత్‌కు గాయం అయ్యిందన్న వార్తల్లో కచ్చితత్వం లేదు. భారత క్రికెట్ అభిమానుల్లో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి."
-సునీల్ గావస్కర్ , భారత దిగ్గజ క్రికెటర్
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా పరిమిత ఓవర్ల సిరీస్‌కు కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించింది బీసీసీఐ. రోహిత్ శర్మ , ఇషాంత్ శర్మల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపింది.
రోహిత్ శర్మ లేకపోవటం వల్ల శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్‌ను టీ20, వన్డే సిరీస్‌కు తీసుకున్నారు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తారు.