ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ సింహింలా గర్జించే సమయం ఆసన్నమైందని ఆ దేశ మాజీ ఆల్‌రౌండర్ టామ్ మూడీ అన్నాడు. భారత్‌తో మూడో టెస్టులో బాగా రాణిస్తాడని వర్ణించే నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.
"స్మిత్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే మనకు ఓ నమ్మకం వస్తుంది. తను వెనుకడుగు వేసినా మళ్లీ పుంజుకుంటాడు. స్మిత్ కూడా ఈ ఏడాది ఎక్కువ పరుగులు చేయగలననే విశ్వాసంతో ఉన్నాడు".
- టామ్ మూడీ, ఆసీస్ మాజీ ఆల్ రౌండర్.
జనవరి 7న భారత్, ఆసీస్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టామ్.. స్మిత్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన ఆసీస్ మహిళా అంపైర్