భారత యువ క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్ ఆసీస్ ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక వెల్లడించింది. బ్రిస్బేన్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఈ సంఘటన జరిగింది. సిరాజ్‌ను "మొద్దబ్బాయి" అని ఓ ప్రేక్షకుడు అన్నట్లు సదరు పత్రిక పేర్కొంది. మూడో టెస్టులోనూ సిరాజ్‌పై చేసిన జాత్యహంకార వ్యాఖ్యల దుమారం చల్లారకముందే ఆసీస్ అభిమానులు మరోసారి అదే తీరును పునరావరృతం చేశారు.
-
Mohammed Siraj was labelled a “bloody grub” by members of the Gabba crowd less than a week after the abuse allegations which marred the Sydney Test
— Sam Phillips (@samphillips06) January 15, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Full story 👇https://t.co/gQtnhwbxMq#AUSvIND pic.twitter.com/QI1tfjRl9z
">Mohammed Siraj was labelled a “bloody grub” by members of the Gabba crowd less than a week after the abuse allegations which marred the Sydney Test
— Sam Phillips (@samphillips06) January 15, 2021
Full story 👇https://t.co/gQtnhwbxMq#AUSvIND pic.twitter.com/QI1tfjRl9zMohammed Siraj was labelled a “bloody grub” by members of the Gabba crowd less than a week after the abuse allegations which marred the Sydney Test
— Sam Phillips (@samphillips06) January 15, 2021
Full story 👇https://t.co/gQtnhwbxMq#AUSvIND pic.twitter.com/QI1tfjRl9z
సిడ్నీ టెస్టులో సిరాజ్‌పై ఆసీస్ వీక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయగా, ఆటను 10 నిమిషాల పాటు నిలిపేశారు. ఆరుగురు ప్రేక్షకులను బయటకు పంపించిన తర్వాత తిరిగి ఆట మొదలు పెట్టారు. ఈ మ్యాచ్‌లో భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యల వ్యవహారంలో క్రికెట్ ఆస్ట్రేలియా ఇప్పటికే క్షమాపలు చెప్పింది. ఈ విషయమై విచారణకూ ఆదేశించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
బోర్డర్-గావస్కర్ సిరీస్ చివరి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు పూర్తయ్యేసరికి ఆస్ట్రేలియా, 274 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. లబుషేన్ సెంచరీతో(108) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం గ్రీన్, పైన్ క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి:జాత్యహంకార వ్యాఖ్యలు.. ఆసీస్ ప్రేక్షకుల తీరు మారదా?