విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ, ధోనీలతో పోల్చవద్దని గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా ఎనిమిదేళ్లు ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన విరాట్.. ఒక్కసారి కూడా టైటిల్ అందించలేకపోయాడని విమర్శించాడు.
' కోహ్లీ అదృష్టవంతుడు.. ఆర్సీబీ ఇంకా తనను కెప్టెన్‌గా కొనసాగిస్తున్నందుకు యాజమాన్యానికి అతడు కృతజ్ఞతలు తెలపాలి. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ ఇద్దరూ...తమ జట్లను మూడు సార్లు విజేతగా నిలిపారు. వారితో కోహ్లీని పోల్చొద్దు. కీలక మ్యాచ్‌ల్లో విరాట్ తీసుకున్న నిర్ణయాల వల్లే బెంగళూరు టైటిల్ అందుకోలేకపోయింది"
-- గౌతమ్ గంభీర్, భారత మాజీ ఆటగాడు
కోల్‌కతా కెప్టెన్‌గా రెండు సార్లు(2012, 2014) జట్టుకు టైటిల్ అందించాడు గౌతమ్. ఈ దిల్లీ ఆటగాడి వ్యాఖ్యల పట్ల భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ స్పందించాడు.
"కోహ్లీ కెప్టెన్సీని ఎవ్వరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఏ ఫార్మాట్లోనైనా తనదైన శైలిలో అద్భుత ప్రదర్శన చేయగలడు. అతడొక ఛాంపియన్. ఆర్సీబీకి సారథిగా ఉండేందుకు అలాంటి విరాట్‌కు అన్ని అర్హతలున్నాయి. ఈ సీజన్లోనూ తప్పకుండా సత్తా చాటుతాడు."
-- సౌరవ్ గంగూలీ, భారత మాజీ సారథి