ETV Bharat / entertainment

ప్రీ బుకింగ్స్​లో 'పుష్ప 2 ' జోరు - 24 గంటల్లోనే ఆ టాప్ సినిమాల రికార్డులన్నీ బద్దలు - PUSHPA THE RULE PRE BOOKING

నార్త్​లో పుష్పరాజ్‌ హవా - ఆ రేర్​ రికార్డ్​తో ఆల్‌టైమ్ టాప్‌3 లిస్ట్‌లోకి 'పుష్ప 2'

Pushpa The Rule Pre Booking Record
Pushpa 2 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 2, 2024, 1:49 PM IST

Pushpa 2 Pre Booking Record : ఇంకా రిలీజ్ కూడా అవ్వలేదు అప్పుడే పలు రికార్డులను ఈజీగా బ్రేక్ చేస్తోంది 'పుష్ప ది రూల్'. డిసెంబర్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్​లో రిలీజవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ప్రీ సేల్‌ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా, అందులో ఈ మూవీ టికెట్లు రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయట.

ఓవర్సీస్‌లో ఇప్పటికే ప్రీ సేల్‌ బుకింగ్స్‌లో జోరు చూపించిన ఈ సినిమా తాజాగా నార్త్​లోనూ ఓ రేంజ్​లో అమ్ముడువుతున్నాయని సినీ వర్గాల మాట. హిందీ వెర్షన్‌లో టికెట్స్‌ ఓపెన్‌ చేయగా, నిమిషాల్లోనే టికెట్లన్నీ బుక్ స్పీడ్​గా బుక్ అవుతున్నాయట. ఈ క్రమంలో అక్కడ 24 గంటల్లోనే ఏకంగా లక్ష టికెట్స్‌ సేల్‌ అయ్యాయట.

అయితే ఈ బుకింగ్స్​తో 'పుష్ప 2' ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే బీటౌన్​లో రికార్డులు సృష్టించిన టైగర్‌3 (65,000), యానిమల్‌ (52,500), డంకీ (42,000), స్త్రీ 2 (41,000) సినిమాలను 'పుష్ప2' బీట్ చేసింది. అలా బాలీవుడ్‌లో ఆల్‌ టైమ్‌ టాప్ సినిమాల లిస్ట్‌లో మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

మరోవైపు ఈ సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే ఇప్పటికే రూ.60కోట్లకు పైగా వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాల సమాచారం. దీంతో 'బాహుబలి', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీఎఫ్‌2'ల ఫస్ట్​డే కలెక్షన్స్​ను 'పుష్ప2' దాటేస్తుందని సినీ అభిమానులు భావిస్తున్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్​ కోసం భారీ ప్లానింగ్
మరోవైపు మూవీ రిలీజ్​కు కౌంట్​డౌన్ దగ్గర పడుతుండటం వల్ల 'పుష్ప2' టీమ్‌ తమ ప్రమోషనల్ ఈవెంట్స్​ను ఫాస్ట్​గా చేస్తోంది. ఇప్పటికే ముంబయి, కొచ్చి అభిమానులను పలకరించిన మూవీ టీమ్, సోమవారం హైదరాబాద్‌లో ఓ భారీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనుంది. దీని కోసం సుమారు ఎనిమిది వేల మందికి పాసులు జారీ చేశారని సమచారం. అయితే ఈ ప్రోగ్రామ్​కు చీఫ్​ గెస్ట్​గా ఎవరు రానున్నారన్న విషయంపై ఆసక్తి నెలకొంది. అభిమానులు కూడా ఆ అతిథి ఎవరో తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

'పుష్ప' నుంచి పీలింగ్స్​ సాంగ్ ఔట్- బన్నీ, రష్మిక క్రేజీ డ్యాన్స్​

'పుష్ప 2' టికెట్ హైక్- బెనిఫిట్​ షో కాస్ట్ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.