ETV Bharat / sports

సెంచరీ చేశాను కానీ ఆనందంగా లేను: లబుషేన్

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్​లో సెంచరీ చేసిన లబుషేన్.. భారీ స్కోరు చేయలేకపోయానని బాధపడుతున్నాడు. కానీ తమ జట్టు రాణించిన తీరుపై ప్రశంసలు కురిపించాడు.

Labuschagne
భారీ స్కోర్​ చేయడంలో విఫలమయ్యా: లబుషేన్
author img

By

Published : Jan 15, 2021, 4:46 PM IST

బ్రిస్బేన్​లో టీమ్​ఇండియాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో తొలిరోజే సెంచరీ చేయడం గురించి ఆస్ట్రేలియా యువ బ్యాట్స్​మన్ మార్నస్ లబుషేన్ మాట్లాడాడు. దానిని భారీ స్కోరుగా మలచడంలో విఫలమైనట్లు పేర్కొన్నాడు. తొలిరోజు ముగిసేసరికి ఆసీస్.. 274/5తో నిలిచింది. క్రీజులో గ్రీన్, కెప్టెన్ పైన్ ఉన్నారు.

లబుషేన్

"శతకం చేసినా జట్టుకు భారీ స్కోరు అందించడంలో విఫలమైనందుకు బాధగా ఉంది. కానీ, జట్టు​ పరంగా రోజు పూర్తయ్యేసరి బాగా ఆడాం. 275/5 అనేది చాలా మంచి స్కోరు. గ్రీన్, టిమ్​ జట్టును ఆదుకున్న తీరు బాగుంది"

-లబుషేన్, ఆస్ట్రేలియా బ్యాట్స్​మన్

స్మిత్​, వేడ్​తో కలిసి లబుషేన్, జట్టుకు మంచి స్కోరు అందించగలిగాడు. 108 వ్యక్తిగత పరుగులు చేసిన తర్వాత అరంగేట్ర ఆటగాడు నటరాజన్​ బౌలింగ్​లో ఔటయ్యాడు. పిచ్​ సానుకూలంగా లేకపోయినా ఆసీస్​ ఆటగాళ్లు బాగా ఆడారని ఈ సందర్భంగా తెలిపాడు. టీమ్​ఇండియా ఆటగాళ్లు పద్ధతిగా బౌలింగ్​ చేశారని ప్రశంసించాడు. ఆట తొలి సెషన్​లో తమను భారీ స్కోరు చేయకుండా అడ్డుకున్నట్లు పేర్కొన్నాడు.

ఇదీ చదవండి:నటరాజన్​ రికార్డు.. ఒకేసారి మూడింటిలో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.