ETV Bharat / sports

ఆసీస్​Xభారత్​: నామమాత్రపు మ్యాచ్​లో గెలుపెవరిది? - బౌలింగ్​లో విఫలమవుతోన్న టీమ్​ ఇండియా

నేడు కాన్​బెర్రా వేదికగా జరగనున్న భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్​ కీలకంగా మారనుంది. ఓ వైపు భారత్​ను క్లీన్​స్వీప్​ చేయాలని ఊవిళ్లూరుతోంది ఆస్ట్రేలియా. మరోవైపు క్లీన్​స్వీప్​ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని భారత్​ ఆశాభావంతో ఉంది. కాన్​బెర్రా వేదికగా ఉదయం 9.10 గంటలకు ఈ మ్యాచ్​ జరగనుంది.

AUS vs IND
భారత్​కు క్లీన్​స్వీప్​ తప్పేనా?
author img

By

Published : Dec 2, 2020, 6:15 AM IST

ఆస్ట్రేలియా చేతిలో క్లీన్‌స్వీప్‌ తప్పించుకోవాలన్నా, టీ20 సిరీస్‌కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధమవ్వాలన్నా నేటి వన్డేలో భారత్‌కు విజయం తప్పనిసరి. పసలేని బౌలింగ్, పేలవ ఫీల్డింగ్, నాయకత్వంలో తడబాటుతో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న టీమిండియా కాన్‌బెర్రా వేదికగా బుధవారం ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌ కోల్పోయిన కోహ్లీసేన ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తుండగా, మరోవైపు క్లీన్‌స్వీప్‌ చేయాలని ఆస్ట్రేలియా ఊవిళ్లూరుతోంది. ఈ నేపథ్యంలో నామమాత్రపు మ్యాచ్ అయినా రేపటి పోరుపై ఆసక్తి నెలకొంది.

AUS vs IND
భారత్​కు క్లీన్​స్వీప్​ తప్పేనా?

వరుసగా 5 వన్డేల్లో ఓటమి

ఈ ఏడాది న్యూజిలాండ్‌ పర్యటనలో భారత్‌ మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ప్రస్తుత్తం జరగనున్న ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 0-2తో చేజార్చుకుంది. అయితే వరుసగా రెండు వన్డే సిరీస్‌లు క్లీన్‌స్వీప్‌ అయిన ఘోరపరాభవాన్ని తప్పించుకోవాలంటే రేపటి మ్యాచ్‌లో కోహ్లీసేన కచ్చితంగా గెలవాలి.

AUS vs IND
బ్యాటింగ్​లో బాగానే రాణిస్తోన్నా భారత్​కు తప్పని ఓటమి

పరువు కాపాడుకోవాలి!

తొలి రెండు మ్యాచ్​ల్లో భారత్​ ఓటమికి పేలవ బౌలింగే కారణం. ఈ నేపథ్యంలో.. మూడో వన్డేలో మార్పులు జరగొచ్చు. ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న నవదీప్​ సైనీ స్థానంలో శార్దుల్​ ఠాకూర్​ లేదా నటరాజన్​ను తీసుకునే అవకాశాలున్నాయి. ​

స్పిన్నర్లు చాహల్​, జడేజా కూడా వికెట్లు తీయలేకపోతున్నారు. కోహ్లీ తొందరపాటు బౌలింగ్​ మార్పులు కూడా భారత్​ ఓటమికి కారణమయ్యాయి. ఇప్పటికే దీనిపై మాజీల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

AUS vs IND
షమికి విశ్రాంతి లభించే అవాకాశమే ఎక్కువాగా!

ఇంకా టీ-20 సిరీస్​కు ముందు ఈ మ్యాచ్​లో గెలుపు భారత్​కు తప్పనిసరి. విజయం సాధిస్తే.. పొట్టి ఫార్మాట్​కు ఆత్మవిశ్వాసంతో సన్నద్ధం కావొచ్చు.

బ్యాటింగ్​లో టీమిండియా బలంగానే ఉంది. కోహ్లీ, రాహుల్​ మెరుగ్గానే కనిపిస్తున్నారు. శ్రేయస్​ ఇన్నింగ్స్​ మంచిగానే ప్రారంభిస్తున్నప్పటికీ.. భారీ స్కోర్లుగా మలచలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్​ కోహ్లీపై ఒత్తిడి కూడా పెరుగుతోంది.

AUS vs IND
పేలవ బౌలింగ్​ ఈసారైనా మారేనా?

క్లీన్​స్వీప్​పై కన్నేసిన ఆసీస్

ఆసీస్​లో స్టార్​ ఓపెనర్​ వార్నర్ గాయం కారణంగా ఈ మ్యాచ్​కు దూరమయ్యాడు. ఇది ఆ జట్టుకు లోటే. అయితే.. చక్కటి బ్యాటింగ్​ ఫామ్ కనబరుస్తోన్న స్మిత్, ఫించ్​, చివరి ఓవర్లలో దూకుడుగా ఆడుతోన్న మాక్స్​వెల్​, లబూషేన్​ ఆసీస్​ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే జోరు కొనసాగించి సిరీస్​ను క్లీన్​స్వీప్​ చేయాలని చూస్తోంది కంగారూ జట్టు.

జట్ల వివరాలు

భారత్‌: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, మయాంక్ అగర్వాల్‌, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని, శార్దూల్‌ ఠాకూర్‌, టీ నటరాజన్‌

ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్‌ స్మిత్, లబుషేన్‌, మాక్స్‌వెల్, స్టాయినిస్‌, అలెక్స్ కేరీ, కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌, సీన్‌ అబాట్‌, ఆస్టన్‌ అగర్, కామెరన్‌ గ్రీన్‌, హెన్రిక్స్‌, ఆండ్రూ టై, డేనియల్ సామ్స్‌, మాథ్యూ వేడ్‌.

ఇదీ చదవండి:టీమ్​ఇండియా గెలవాలంటే మార్పులు అనివార్యమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.