ETV Bharat / sports

అప్పుడు కోహ్లీని క్షమించమని అడిగా: రహానె - rahane as captain of test series

తొలిటెస్టులో కోహ్లీ రనౌట్​ గురించి తాత్కాలిక కెప్టెన్ రహానె మాట్లాడాడు. మ్యాచ్​ తర్వాత విరాట్​ను క్షమాపణలు అడిగానని చెప్పాడు.

Apologised to Virat after that run out, he was okay about it: Rahane
'ఆ మ్యాచ్​ తర్వాత కోహ్లీని క్షమాపణలు కోరాను'
author img

By

Published : Dec 25, 2020, 3:05 PM IST

ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో అజింక్య రహానేతో సమన్వయం లోపం వల్ల కోహ్లీ రనౌట్​ అయ్యాడు. అయితే ఆ మ్యాచ్​ అనంతరం తాను విరాట్ దగ్గరకు వెళ్లి క్షమాపణలు అడిగానని రహానె చెప్పాడు. ఆ సమయంలో అతడు సానుకూలంగా స్పందించాడని తెలిపాడు.

"మ్యాచ్​ అయిన తర్వాత కోహ్లీని కలిసి జరిగిన విషయమై క్షమాపణలు కోరాను. దానికి అతడు సానుకూలంగా స్పందించాడు. ఆ పరిస్థితిలో మేమిద్దరం బాగానే ఆడాలని అనుకున్నాం. కానీ ఆటలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. వాటిని గౌరవించి ముందుకు వెళ్లాలి. ఆ రనౌట్​ తర్వాత​ మ్యాచ్​లో​ ఆస్ట్రేలియా ఆధిపత్యం కొనసాగడం గమనించాను"

-- అజింక్య రహానె, టీమ్​ఇండియా తాత్కాలిక టెస్టు కెప్టెన్

అడిలైడ్​లో జరిగిన​ తొలి టెస్టులో టీమ్​ఇండియా కెప్టెన్​​ కోహ్లీ రనౌట్​ కావడం.. ఆ మ్యాచ్​ గతినే మార్చేసింది! అజింక్య రహానేతో భాగస్వామ్యంతో క్రీజులో ఉన్న కోహ్లీ(74).. సమన్వయ లోపం వల్ల పెవిలియన్​కు చేరాడు. ఈ పోరులో 8 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్.. సిరీస్​లో 1-0 ఆధిక్యం సంపాదించింది.

ఆస్ట్రేలియా భారత్​ మధ్య రెండో టెస్టు శనివారం(డిసెంబరు 26) ప్రారంభం కానుంది. పితృత్వ సెలవులపై కోహ్లీ స్వదేశానికి వెళ్లగా.. తాత్కాలిక కెప్టెన్సీ బాధ్యతలను రహానె నిర్వర్తించనున్నాడు.

ఇదీ చూడండి: కోహ్లీసేనకు బ్యాడ్​న్యూస్.. భువీ మరో ఆరు నెలల పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.