ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్(WTC Final) ముంగిట టీమ్ఇండియాను హెచ్చరించాడు భారత మాజీ పేసర్ అజిత్ అగార్కర్. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును తక్కువ అంచనా వేస్తే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పరోక్షంగా అన్నాడు.
"ఫైనల్లో న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేసి టీమ్ఇండియా(TeamIndia) పశ్చాతాపం పడుతుందని నేను భావించడం లేదు. నాకు తెలిసినంత వరకు కివీస్ అండర్డాగ్ ట్యాగ్‌ను తొలగించుకుంది. టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్.. అన్ని ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సత్తా చాటుతోంది. భారత జట్టు న్యూజిలాండ్‌లో పర్యటించినప్పుడు వారు మనోళ్లను ఓడించారు. కాబట్టి కోహ్లీసేన జాగ్రత్తగా ఆడి.. కివీస్ జట్టును ఓడించాలి" అని అగార్కర్ అన్నాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరగబోయే ఈ ఛాంపియన్షిప్ ఫైనల్(జూన్18-22) తర్వాత అక్కడే ఉండి ఇంగ్లీష్ జట్టుతో టెస్టు సిరీస్(ఆగస్టు 4-సెప్టెంబరు 14) ఆడనుంది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: WTC final: జిమ్‌లో చెమట చిందిస్తూ.. ఫైనల్‌కు సిద్ధమవుతూ