ETV Bharat / sports

Ind vs NZ: దంచికొట్టిన రోహిత్​.. కివీస్ లక్ష్యం 185 - రాహుల్

న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్​లో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది భారత్. దీంతో కివీస్​ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు.

ind vs nz t20
ind vs nz t20
author img

By

Published : Nov 21, 2021, 8:52 PM IST

Updated : Nov 21, 2021, 9:18 PM IST

న్యూజిలాండ్​తో జరుగుతున్న ఆఖరి టీ20లో టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (56) అర్ధ శతకంతో రాణించాడు. మరో ఓపెనర్​ ఇషాన్​ కిషన్​తో (29) కలిసి దూకుడుగా ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది భారత్​. దీంతో కివీస్​ ముందు 185 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20) ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో హర్షల్ పటేల్ (18), దీపక్ చాహర్ (21) మెరుపులు మెరిపించారు.

కివీస్ బౌలర్లలో సాంట్నర్ 3 వికెట్లు, బౌల్ట్, మిల్నే, సోధీ, ఫెర్గూసన్ తలో వికెట్ తీశాడు.

గంటకొట్టిన దాదా..

sourav ganguly
గంట కొట్టి మ్యాచ్​ను ప్రారంభించిన గంగూలీ

కోల్​కతాలోని ఈడెన్​ గార్డెన్స్​లో జరుగుతున్న ఈ మ్యాచ్​ను గంట కొట్టి ప్రారంభించారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దాదానే ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. లార్డ్స్​ తరహాలో ఉన్న ఈ ఆచారం.. భారత్​లో మరెక్కడా లేదు. అయితే బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం.. తొలిసారి ఆ గంటను కొట్టి మ్యాచ్​ను ప్రారంభించారు గంగూలీ.

ఇదీ చూడండి: రోహిత్ ప్రపంచ రికార్డు- కోహ్లీని వెనక్కునెట్టి..

Last Updated : Nov 21, 2021, 9:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.