ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా మొదటి స్థానంలో నిలించింది. 121 రేటింగ్ పాయింట్లతో నంబర్‌వన్ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంది. 120 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో న్యూజిలాండ్ నిలిచింది.
24 మ్యాచ్‌ల్లో 2914 పాయింట్లు టీమ్ఇండియా సాధించగా.. 18 టెస్టుల్లో 2166 పాయింట్లు సాధించింది న్యూజిలాండ్.
ఆస్ట్రేలియా(108)ను వెనక్కినెట్టి.. ఇంగ్లాండ్ 109 పాయింట్లతో మూడో స్థానం సంపాదించుకుంది. తర్వాత స్థానాల్లో పాకిస్థాన్, వెస్టిండీస్ ఉన్నాయి.
మొదటి రెండు స్థానాల్లో నిలిచిన టీమ్ఇండియా, న్యూజిలాండ్.. జూన్ 18-22 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో తలపడనున్నాయి.
ఇదీ చదవండి:'ఎవరేమన్నా.. టోక్యో ఒలింపిక్స్ ఆగదు'