ETV Bharat / sports

'ఆ విషయంలో ద్రవిడ్ మమ్మల్ని అనుసరించాడు' - England

యువక్రికెటర్లలో ప్రతిభను గుర్తించి వారిని మెరుగ్గా తీర్చిదిద్దటంలో ఆస్ట్రేలియా కన్నా భారత్​, ఇంగ్లాండ్​ ముందున్నాయని అన్నాడు ఆసీస్​ దిగ్గజం గ్రెగ్​ చాపెల్​. ఈ విషయంలో తమ దేశ బోర్డు వెనుకపడిపోయిందని చెప్పాడు.

dravid
ద్రవిడ్​
author img

By

Published : May 12, 2021, 10:10 PM IST

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ రాహుల్​ ద్రవిడ్ ఎందరో యువ క్రికెటర్లలో ప్రతిభను వెలికితీయడం సహా వారిని మెరికల్లా తీర్చిదిద్ది భారత జట్టుకు అందించాడు. అయితే ఇదంతా ఆస్ట్రేలియా క్రికెట్​లోని మేధాసంపత్తిని ఉపయోగించి ఈ ఫలితాలు సాధించాడని ఆసీస్​ దిగ్గజం గ్రెగ్​ చాపెల్ అన్నాడు​.

"నైపుణ్యాలు ఉన్న ఆటగాళ్లను గుర్తించి వారిని సరైన రీతిలో శిక్షణ ఇవ్వడంలో ఆస్ట్రేలియా కన్నా భారత్​, ఇంగ్లాండ్​ విజయవంతమయ్యాయి. ద్రవిడ్.. ఆస్ట్రేలియా తరహా​ మేధాసంపత్తిని ఉపయోగించి, భారత్​లో ఆటగాళ్లను మెరుగ్గా తీర్చిదిద్దే శిక్షణ వ్యవస్థను పటిష్ఠంగా చేశాడు. అందుకే భారత్​ విజయవంతమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్​ఇండియా​ ఘన విజయం సాధించడమే ఇందుకు ఉదాహరణ. సాధారణంగా ఈ ప్రక్రియలో మేం ముందుంటాం. కానీ గత రెండేళ్లుగా వెనుకపడ్డామని అనుకుంటున్నాం. సామర్థ్యం ఉన్న చాలా మంది యువక్రికెటర్లు ఇక్కడా ఉన్నారు. వారిలో ఏ ఒక్కరిని కోల్పోకూడదు"

-గ్రెగ్​ ఛాపెల్​, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్​

ద్రవిడ్‌ 2016 నుంచి 2019 వరకు అండర్‌-19, ఇండియా-ఏ జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. అతడి నేతృత్వంలోనే రిషభ్‌ పంత్‌, మహ్మద్‌ సిరాజ్‌, నవ్‌దీప్‌ సైనీ, నటరాజన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శుభ్‌మన్‌గిల్‌ లాంటి యువకులు మెరుగయ్యారు.

ఇదీ చూడండి: 'యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనకు ఆయనే కారణం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.