ETV Bharat / sports

WTC Final: 'కివీస్​ను ఢీ కొట్టగల సత్తా భారత్ సొంతం' - వెంకటేష్ ప్రసాద్

సౌథాంప్టన్​ వేదికగా జూన్​ 18 నుంచి కివీస్​తో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​ (WTC Final)పై సానుకూలంగా స్పందించాడు మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్(Venkatesh Prasad). గతంతో పోలిస్తే టీమ్ఇండియా.. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో మెరుగుపడిందని తెలిపాడు. సమయం తక్కువగా ఉన్నప్పటికీ భారత్​కు కూడా మంచి ప్రాక్టీస్​ లభించిందని అభిప్రాయపడ్డాడు.

team india, venkatesh prasad
టీమ్ఇండియా, వెంకటేష్ ప్రసాద్
author img

By

Published : Jun 14, 2021, 4:02 PM IST

సౌథాంప్టన్(Southampton)​ వేదికగా జూన్​ 18 నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ టెస్టు​ ఛాంపియన్​షిప్​ ఫైనల్ (WTC Final)​పై స్పందించాడు మాజీ బౌలర్​ వెంకటేష్ ప్రసాద్(Venkatesh Prasad). కివీస్​ను అధిగమించగల అన్ని వనరులు టీమ్ఇండియాకు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. కొత్త బంతితో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచగల సీమర్లు జట్టులో ఉన్నారని తెలిపాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా స్కోరు బోర్డుపై 350 పరుగులు చేయగల సత్తా బ్యాటింగ్ దళం భారత్ సొంతమని పేర్కొన్నాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్లో రెండు మంచి జట్లు తలపడబోతున్నాయి. టీమ్ఇండియాకు మంచి వనరులు ఉన్నాయి. వారి బెంచ్ చాలా బలంగా ఉంది. గతంతో పోలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో భారత్​ చాలా మెరుగు పడింది. పలువురు ఆల్​రౌండర్లతో జట్టు సమతూకంగా ఉంది. మనకెప్పుడు ప్రపంచ స్థాయి స్పిన్నర్లు మాత్రమే ఉండేవారు. కానీ, ఇప్పుడు ప్రపంచ స్థాయి పేస్​ బలగం కూడా ఉంది."

-వెంకటేష్ ప్రసాద్, మాజీ క్రికెటర్.

ఇదీ చదవండి: WTC Final: ముగిసిన టీమ్​ఇండియా ప్రాక్టీస్​ మ్యాచ్​

తుది జట్టులో ఎవరు ఉండాలనే విషయం కెప్టెన్ విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ప్రసాద్ తెలిపాడు. తనవరకైతే బౌలింగ్ విభాగంలో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో భారత్​ బరిలోకి దిగాలని అభిప్రాయపడ్డాడు. ఇషాంత్, షమీ బుమ్రాతో పాటు అశ్విన్, జడేజా తుది జట్టులో ఉండాలని పేర్కొన్నాడు.

ప్రత్యర్థుల బలాబలాలపై ఎక్కువగా ఆసక్తి చూపడం అవసరం లేని విషయమని ప్రసాద్ స్పష్టం చేశాడు. ఆట ఐదవ రోజుకు వెళ్లడం ఖాయమని తెలిపాడు. అదే ఇండియాలో మూడు లేదా నాలుగో రోజులోనే ఫలితం వచ్చేదన్నాడు. డ్యూక్​ బంతితో ఏదైనా జరగొచ్చని.. ఇప్పటికే రెండు టెస్ట్​ల సిరీస్​ ఆడిన కివీస్​ స్వల్పంగా ప్రయోజనముందని తెలిపాడు. భారత్​ కూడా దొరికిన సమయాన్ని బాగానే ఉపయోగించుకుందని పేర్కొన్నాడు. ఈ కాస్త సమయంలోనూ భారత్ అనుకున్నట్టుగా సన్నద్ధతమైందని అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: ICC: 'ప్లేయర్​ ఆఫ్ ది మంత్' విజేతలు వీరే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.