ETV Bharat / sports

టీమ్​ఇండియా ఆటతీరుపై షేన్ వార్న్ ప్రశంసలు

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఆడిన తీరుపై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వార్న్(Shane Warne on Virat Kohli). అద్భుత ప్రదర్శన చేసినందుకుగాను కోహ్లీసేనకు ధన్యవాదాలు తెలిపాడు.

shane warne
షేన్ వార్న్
author img

By

Published : Sep 11, 2021, 1:17 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్(Shane Warne on Ind vs Eng) అన్నాడు. కరోనా కారణంగా ఐదో టెస్టును రద్దు చేస్తూ ఈసీబీ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించిన వార్న్.. కోహ్లీసేనపై ప్రశంసలు కురిపించాడు.

"ఈ సిరీస్​లో టీమ్​ఇండియా ప్రదర్శన అద్భుతం. వారు ఆడిన తీరుకు నా టోపీ తీసి సలాం కొడుతున్నా. నిజానికి రెండు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఇంగ్లాండ్, టీమ్​ఇండియా మధ్య చివరి టెస్టు రద్దుకావడం మంచి విషయమే. ఒకవేళ మ్యాచ్​ మధ్యలో ఉండగా ఆటగాళ్లకు కరోనా ఉందని తెలిస్తే.. ఆ ప్రభావం ఐపీఎల్​పై పడేది."

--షేన్ వార్న్, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.

ఇంగ్లాండ్​ జట్టును వారి గడ్డపైనే ఓడించాలని టీమ్​ఇండియా ఆశించిందని వార్న్(Shane Warne news) అన్నాడు. డ్యూక్స్​, స్వింగ్, సీమింగ్ బంతులతో మంచి ఫలితం రాబట్టిందని.. 2-1 తేడాతో సిరీస్​ ఆధిక్యంలో ఉండటం హర్షనీయమని పేర్కొన్నాడు. కోహ్లీసేన గతేడాది ఆస్ట్రేలియాలోను అద్భుత ప్రదర్శన చేసిందని గుర్తుచేశాడు.

భారత్-ఇంగ్లాండ్​(Ind vs Eng 5th Test) మధ్య జరగాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయింది. ఈ మేరకు ఇంగ్లాండ్​ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. భారత జట్టు శిక్షణ బృందంలోని సభ్యులకు కరోనా వైరస్‌ సోకడం వల్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి:IND Vs ENG 5th Test: 'మ్యాచ్​ రద్దుకు కరోనా కారణం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.