ETV Bharat / sports

'ఆ జట్లకు దీటుగా భారత పేస్​ బౌలింగ్'

టీమ్ఇండియా(Team India) పేస్​ బౌలింగ్​ పటిష్ఠంగా ఉందంటూ ఆస్ట్రేలియా మాజీ సారథి ఇయాన్ చాపెల్(Ian Chappell)​ అభిప్రాయపడ్డాడు. పేస్ బౌలింగ్ నైపుణ్యం కలిగిన జట్ల సరసన కోహ్లీసేన చేరిందని పేర్కొన్నాడు. ​

ian chappell, former australia captain
ఇయాన్ ఛాపెల్, ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
author img

By

Published : Jul 4, 2021, 2:13 PM IST

టీమ్ఇండియా(Team India) పేస్​ బౌలర్ల​పై ప్రశంసలు కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్(Ian Chappell). భారత పేస్ విభాగం.. ప్రస్తుతం పేస్​ బౌలింగ్​ నైపుణ్యం కలిగిన జట్ల సరసన చేరిందని కితాబిచ్చాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినప్పటికీ.. ఇషాంత్, బుమ్రా, షమీ, సిరాజ్​తో కూడిన బౌలింగ్ దళం పటిష్ఠంగా ఉందని అభిప్రాయపడ్డాడు.

"గత కొద్ది కాలంగా టీమ్ఇండియా బౌలింగ్ మెరుగుపడింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాలో విజయంతో పాటు ప్రతిష్ఠాత్మక ఫైనల్​కు అర్హత సాధించారు. ఇప్పుడు ఇంగ్లాండ్​ను వారి గడ్డపై ఓడించే అవకాశం లేకపోలేదు. వారి పేస్​ బౌలర్లు మెరుగైన ఫలితాలను రాబడుతున్నారు."

-ఇయాన్ చాపెల్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్.

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్లో కివీస్​ బౌలింగ్​పై ఇయాన్ స్పందించాడు. వారి పేస్ విభాగం సమర్థంగా పని పూర్తి చేశారని తెలిపాడు. టిమ్​ సౌథీ, ట్రెంట్​ బౌల్ట్, నీల్ వాగ్నర్, కైల్ జేమీసన్​.. ఆట చివరి రోజు అత్యుత్తమంగా రాణించారని గుర్తుచేశాడు. దీంతో ఫలితమే తేలదనుకున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ విజేతగా నిలిచిందని పేర్కొన్నాడు. వీరి బౌలింగ్ విభాగం 1970-90 వరకు బౌలింగ్​లో ఆధిపత్యం ప్రదర్శించిన విండీస్​ బౌలర్లతో పోల్చాడు చాపెల్.

"డబ్ల్యూటీసీ గణాంకాలను పరిశీలిస్తే కైల్ జేమీసన్​ కివీస్​ బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించినట్లు అనిపించింది. కానీ, నిజానికి టిమ్ సౌథీ.. న్యూజిలాండ్ బౌలింగ్ దాడికి సారథిగా ఉన్నాడు" అని చాపెల్ అభిప్రాయపడ్డాడు.

ఇదీ చదవండి: 'పృథ్వీని తీసుకుంటే వారిని అవమానించినట్లే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.