ETV Bharat / sports

వన్డేల్లో అగ్రస్థానానికి టీమ్​ఇండియా.. కివీస్‌పై సిరీస్‌ క్లీన్‌స్వీప్​తో టాప్​లోకి - న్యూజిలాండ్‌తో సిరీస్ క్లీన్‌స్వీప్‌

కివీస్‌పై వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టీమ్‌ఇండియానే అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జనవరి 27 నుంచి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది.

india go top of odi rankings with series win over new zealand
వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన టీమ్‌ఇండియా
author img

By

Published : Jan 25, 2023, 7:28 AM IST

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్‌ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియా నిర్దేశించిన 386 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌.. 41.2 ఓవర్లలో 295 పరుగులకే ఆలౌటైంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ని భారత్ 3-0 తేడాతో క్లీన్‌స్వీప్‌ చేసింది. కివీస్‌పై సిరీస్‌ని క్లీన్‌స్వీప్‌ చేసిన టీమ్‌ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం 114 రేటింగ్స్‌ పాయింట్లతో భారత్ తొలి స్థానంలో ఉండగా.. 113 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లాండ్‌ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా (112), న్యూజిలాండ్‌ (111), పాకిస్థాన్‌ (106) రేటింగ్‌ పాయింట్లతో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టీ20 ర్యాంకింగ్స్‌లోనూ టీమ్‌ఇండియా అగ్రస్థానంలో ఉంది. 276 రేటింగ్ పాయింట్లతో భారత్‌ టాప్‌ ప్లేస్‌లో ఉండగా.. 266 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లాండ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్‌ (258), సౌతాఫ్రికా (256), న్యూజిలాండ్‌ (252) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక, భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య జనవరి 27 నుంచి మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. జనవరి 27న తొలి టీ20, 29న రెండో టీ20, ఫిబ్రవరి 1న మూడో టీ20 జరగనుంది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.