ETV Bharat / sports

టీమ్​ఇండియాదే టీ20 సిరీస్​.. శ్రీలంకపై ఘన విజయం - india sri lanka 2nd t20

IND vs SL 2nd T20: శ్రీలంకతో టీ20 సిరీస్​ను భారత్ కైవసం చేసుకుంది. రెండో మ్యాచ్​లో టీమ్​ఇండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

srilanka news
శ్రీలంక
author img

By

Published : Feb 26, 2022, 10:26 PM IST

IND vs SL 2nd T20: రెండో టీ20లోనూ టీమ్​ఇండియా ఘనవిజయం సాధించింది. దీంతో శ్రీలంకతో టీ20 సిరీస్​ను మరో మ్యాచ్​ మిగిలుండగానే సొంతం చేసుకుంది.

ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్​కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికి కెప్టెన్ రోహిత్ శర్మ(1) ఔటయ్యాడు. ఆ తర్వాత 16 పరుగులు చేసిన ఇషాన్ కిషన్ పెవిలియన్​ చేశారు.

అనంతరం సంజూ శాంసన్​తో కలిసి శ్రేయస్ అయ్యర్(74 నాటౌట్).. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మూడో వికెట్​కు ఈ జోడీ 84 పరుగులు జోడించింది. ఆ తర్వాత 39 రన్స్ చేసిన సంజూ ఔటయ్యాడు. చివర్లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడిన జడేజా(45 నాటౌట్).. శ్రేయస్​తో కలిసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో కుమార 2, చమీర 1 వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ గెలిచిన భారత్.. శ్రీలంకకు బ్యాటింగ్ అప్పగించింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. నిస్సంక 75, షనక 45, గుణతిలక 38 పరుగులు చేశారు. టీమ్​ఇండియా బౌలర్లలో భువనేశ్వర్, చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా, జడేజా తలో వికెట్ తీశారు.

ఇదీ చూడండి : IND VS SL: పాటలు పాడి అలరించిన సిరాజ్-ఇషాన్ కిషన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.