ఆస్ట్రేలియా మహిళా జట్టుతో చారిత్రక డేనైట్ టెస్టులో తలపడేందుకు సిద్ధమైంది భారత మహిళా జట్టు(INDW vs AUSW Test). భారత్‌కు ఇదే తొలి గులాబి బంతి టెస్టు. 2019 తర్వాత ఆస్ట్రేలియాకు ఇదే తొలి టెస్టు కాగా ఈ ఏడాది ఇంగ్లాండ్‌తో టెస్టు డ్రా చేసుకున్న మిథాలీ సేనకు ఇది రెండో టెస్టు. ఇరుజట్లు ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు ప్రణాళికల్ని రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ సమయం, పిచ్ పరిస్థితి వంటి అంశాలు చూద్దాం.
వేదిక: కర్రారా ఓవల్, కర్రారా
తేదీ, సమయం: సెప్టెంబర్ 30-అక్టోబర్ 3, ఉదయం 10గంటల నుంచి ప్రారంభం
ప్రత్యక్ష ప్రసారం - సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్
పిచ్ : క్వీన్స్‌లాండ్‌లోని కర్రారా ఓవల్ ఇప్పటివరకు ఒకే ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు అతిథ్యమిచ్చింది. ఈ వేదికలో ఎక్కువగా బిగ్‌బాష్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ పిచ్‌పై బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించారు ఆటగాళ్లు. దీంతో ఈ పింక్ టెస్టులో కూడా అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లకు సమాన అవకాశాలు లభిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జట్లు (అంచనా)
ఆస్ట్రేలియా మహిళలు
అలిసా హేలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్ (కెప్టెన్), ఆష్లే గార్డ్నర్, ఎలిసా పెర్రీ, తహిలా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అన్నాబెల్ సదర్లాండ్/జార్జియా వారెహామ్, డార్సీ బ్రౌన్, స్టెల్లా క్యాంప్‌బెల్, మొల్లీ స్ట్రానో
భారత మహిళలు
స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, పూనమ్ రౌత్, శిఖా పాండే, మిథాలీ రాజ్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్, తానియా భాటియా, స్నేహ్ రానా, పూజా వస్త్రాకర్, జులాన్ గోస్వామి.