ETV Bharat / sports

ప్రేయసిని పెళ్లి చేసుకున్న భారత ఆల్​రౌండర్​ - శివమ్ దూబే వివాహం

భారత ఆల్​రౌండర్ శివమ్​ దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు దూబే.

shivam dube, dube image
శివమ్ దూబే, శివమ్ దూబే ఫొటో
author img

By

Published : Jul 17, 2021, 7:09 PM IST

భారత క్రికెట్ జట్టు ఆల్​రౌండర్ శివమ్​ దూబే తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు. అంజుమ్​ ఖాన్​తో దూబే వివాహం జరగగా.. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అతనికి శుభాకాంక్షలు తెలిపింది.

దూబే తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. 'ఇది ప్రేమ కంటే చాలా గొప్పది. జీవితాంతం అనే మాటకు ఆరంభం ఇదే. 2021 జులై 16న ఇద్దరం ఒకటయ్యాం,' అని క్యాప్షన్ జోడించాడు.

హార్ధిక్​ పాండ్య స్థానంలో భారత జట్టులోకి ప్రవేశించాడు దూబే. 2019 నవంబర్ నుంచి 2021 ఫిబ్రవరి మధ్య కాలంలో ఒక వన్డే, 13 టీ20లు ఆడాడు. 13 టీ20ల్లో 105 పరుగులు చేశాడు. 5 వికెట్లు తీశాడు. ప్రస్తుతం దుబాయ్ వేదికగా జరగనున్న 2021 ఐపీఎల్​ రెండో దశలో ఆడేందుకు వేచిచూస్తున్నాడు దూబే.

ఇదీ చదవండి:'శివమ్​ కుదురుకునేందుకు కాస్త సమయమివ్వాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.