IND vs WI team squad 2023 : సీనియర్లు ఒక్కొక్కరుగా టీమ్ఇండియా టెస్టు జట్టుకు దూరమవుతున్నారు. అదే సమయంలో మరోవైపు యంగ్ ప్లేయర్స్‌కు అవకాశాలు దక్కుతున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు టెస్టుల్లో రెగ్యులర్ ఓపెనర్‌గా శిఖర్ ధావన్ ఉండేవాడు. కానీ ఇప్పుడతది ఊసే కనపడట్లేదు. ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మెరుగైన ప్రదర్శన చేయలేక ఛెతేశ్వర్ పుజారా జట్టులో చోటును కోల్పోవాల్సి వచ్చింది. శ్రేయస్ అయ్యర్ కూడా గాయంతో జట్టుకు అందుబాటులో లేడు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. గాయంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న బుమ్రా ఎప్పుడు జట్టులోకి తిరిగి వస్తాడో స్పష్టత లేదు. ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ వంటి సీనియర్ బౌలర్లు ఇక కనిపించే అవకాశం తక్కువే. వారి కథ ముగిసినట్లే! ప్రస్తుతానికైతే మహ్మద్ షమి బ్రేక్‌లో ఉన్నాడు. రెస్ట్ తీసుకుంటున్నాడు. దీంతో వెస్టిండీస్ ప్రారంభంకానున్న సిరీస్‌లో పెద్దగా ఎక్స్పీరియన్స్ లేని, కొత్త ప్లేయర్లకు ఛాన్స్‌లు అందనున్నాయి.
ind vs wi team squad 2023 : ఆ ముగ్గురిలో ఒకరికి.. విశ్రాంతి పేరుతో షమి దూరమైన కారణంగా.. హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ నాయకత్వంలో పేస్ దళం బరిలోకి దిగనుంగది. అతడికి తోడుగా శార్దూల్ బరిలోకి దిగుతాడు. ఇక మూడో పేసర్ స్థానం కోసం ముగ్గురు ఆటగాళ్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. ముకేశ్ కుమార్, ఉనద్కత్ నవ్‌దీప్, నవదీప్ సైని మధ్య పోటీ ఉండనుంది. అయితే వీరిలో ముకేశ్ కుమార్.. ఇప్పటివరకు అంతర్జాతీయ మ్యాచులు ఒక్కటి కూడా ఆడలేదు. ఉనద్కత్‌కు దేశవాళీల్లో చాలా అనుభవం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ క్రికెట్లో రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. మొదటి టెస్టు.. ఎప్పుడో 2010లో ఓ సారి ఆడాడు. ఆ తర్వాత మళ్లీ కొన్ని నెలల కిందటే రెండో మ్యాచ్ ఆడాడు. ఇక నవ్‌దీప్ సైనికు కూడా రెండు టెస్టుల అనుభవం మాత్రమే ఉంది. అయితే ఈ ముగ్గరిలో.. ప్రస్తుతం ఫామ్, స్వింగ్ కారణంగా ముకేశ్ కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇక బుమ్రా కొద్దిరోజులు తర్వాత తిరిగి వచ్చినప్పటికీ, అలాగే షమి కూడా.. వీరిద్దరు ఎంతో కాలం ఆటలో ఉండకపోవచ్చు. కాబట్టి వచ్చిన అవకాశాలను ఉపయోగించున్నవాళ్లకు మంచి భవిష్యత్తు ఉండొచ్చు.
ఆ ఇద్దరిలో ఒకరు కొత్త 'గోడ'గా.. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే.. కోహ్లీ, రోహిత్, రహానెలను పక్కనపెడితే.. కుర్రాళ్లే బ్యాటింగ్ భారాన్ని మోయాలి. హిట్ మ్యాన్‌తో కలిసి ఓపెనింగ్ చేసేది శుభ్‌మన్ గిల్. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ యువ బ్యాటర్.. తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అయితే విదేశీ పేస్ పిచ్‌లపై మాత్రం ఇంకా ఎటువంటి అద్భుత ప్రదర్శన చేయలేదు. ఇక జరగబోయే వెస్టిండీస్ బౌన్సీ వికెట్లపై అతడికి పరీక్ష ఎదురుకానుంది. ఈ సిరీస్‌లో అతడు తన ప్రదర్శనతో అదరగొడితే.. ఓపెనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవచ్చనే చెప్పాలి.
నెక్ట్స్ ద్రవిడ్ కోసం.. ఇక జట్టులో అందరి దృష్టి మూడో స్థానం మీదే. ఎందుకంటే 'ద్రవిడ్ ది వాల్' తర్వాత ఈ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న సమయంలో పుజారా వచ్చినా అది సాధ్యమవ్వలేదు. అతడు పాతుకుపోలేకపోయాడు. ఫామ్ దెబ్బ తినడంతో మొదటిసారి జట్టులో చోటు కోల్పోయాడు. ఇంకా అతడికి వయసు కూడా మీద పడుతుంది. కాబట్టి.. భవిష్యత్తులో అతడి స్థానంలో కొత్త 'గోడ' కోసం సెలక్టర్లు వెతుకుతారు. ఇప్పుడు వెస్టిండీస్‌తో జరగబోయే సిరీస్‌లో యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌ల్లో ఒకరికి ఈ మూడో స్థానం దక్కొచ్చు. అయితే లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అవ్వడం వల్ల యశస్వికి ఎక్కువ ప్రాధాన్యత చూపొచ్చు. దేశవాళీలోనూ మంచిగా రాణించాడు. అలా కాకుండా ఎక్స్‌పీరియన్స్‌గా పరంగా చూస్తే.. లిమిటెడ్ ఓవర్ క్రికెట్లో ఆడిన రుతురాజ్‌ను తీసుకోవచ్చు. మరి ఈ ఇద్దరిలో ఎవరు అవకాశం దక్కించుకుంటారో.. ఒకవేళ దాన్ని సద్వినియోగం చేసుకుంటే కీలక ఆటగాడిగా ఎదగడానికి ఛాన్స్ దొరుకుతుంది.
వికెట్ కీపర్ ఎవరో.. వికెట్ కీపర్ స్థానం కోసం కూడా యంగ్ ప్లేయర్స్ మధ్య పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే రిషబ్ పంత్ జట్టులో ఆ స్థానం కోసం కుదురుకున్నాడు. కానీ ఇప్పుడు రోడ్డు ప్రమాదం వల్ల అతడు చాలా కాలం పాటు ఆటకు దూరమయ్యాడు. తిరిగెప్పుడు వస్తాడో తెలీదు. దీంతో అతడి స్థానంలో ఆంధ్రా కుర్రాడు కేఎస్ భరత్‌కు ఛాన్స్ వచ్చింది. కానీ అతడు ఇప్పటివరకు అద్భుతం చేయలేకపోయాడు. అతడికి పోటీగా టీమ్‌లో ఇషాన్ కిషన్ ఉన్నాడు. మరి వీరిద్దరిలో తుది జట్టులో ఎవరుంటారో. మరి వీరిలో ఎవరికి అవకాశం దొరుకుందో.. దొరికిన వాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారో లేదో..