IND vs WI T20 series: భారత్ వేదికగా టీమ్ఇండియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టును ప్రకటించింది వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. కీరన్ పొలార్డ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు, నికోలస్ పూరన్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.
ఇటీవలే విండీస్ బోర్డు వన్డే జట్టును ప్రకటించింది. అనంతరం సీనియర్ ఆటగాళ్లకు, పొలార్డ్‌కు మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు విస్తృతమయ్యాయి. దీనిపై విండీస్ బోర్డు కూడా స్పందించింది. ఆటగాళ్ల మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ అనంతరం భారత్ పర్యటించనుంది.
వెస్టిండీస్ జట్టు:
కీరన్ పొలార్డ్(కెప్టెన్), నికోలస్ పూరన్(వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, డారెన్ బ్రావో, రోస్టన్ చేజ్, షెల్డన్ కాట్రెల్, డొమినిక్ డ్రేక్స్, జేసన్ హోల్డర్, హోప్, అకియెల్ హోసేన్, బ్రాండన్ కింగ్, పావెల్, స్మిత్ షెపర్డ్, కైల్ మేయర్స్, హేడెన్ వాల్ష్.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి:
చరిత్ర సృష్టించిన ఆష్లే బార్టీ.. 44 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాకు టైటిల్