ETV Bharat / sports

Ind vs Wi T20 : ఆసక్తికరంగా రెండో టీ20.. ఈ మ్యాచ్​లోనైనా కుర్రాళ్లు కొట్టేస్తారా? - భారత్ వర్సెస్ విండీస్ టీ20

Ind vs Wi T20 : తొలి టీ20​లో డీలా పడిన బ్యాటర్లు.. రెండో మ్యాచ్​లో అయినా పుంజుకోవాలని టీమ్ఇండియా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి ఆదివారం గయానా ప్రావిడెన్స్‌ స్టేడియం వేదికగా జరగనున్న మ్యాచ్​లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Ind vs Wi T20
భారత్ వర్సెస్ విండీస్ టీ20
author img

By

Published : Aug 6, 2023, 8:08 AM IST

Ind vs Wi T20 : భారత్​తో టెస్టు, వన్డేల్లో తేలిపోయిన వెస్టిండీస్ జట్టు.. తొలి టీ20లో అద్భుతంగా రాణించి విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో మామూలు లక్ష్యాన్ని అందుకోలేని టీమ్ఇండియా.. అనేక విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. కాగా ఆదివారం జరగనున్న రెండో టీ20లో గెలిచి.. సిరీస్​ను సమం చేయాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లు.. బ్యాటుతో రాణించి తమ సత్తా చాటుకోవాల్సిన అవసరం ఉంది. మరి పెద్దగా బ్యాటింగ్​కు అనుకూలంగా లేని గయానా పిచ్​పై ప్రత్యర్థి బౌలర్లను.. భారత కుర్రాళ్లు ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్​లో దుమ్మురేపిన ఆటగాళ్లు శుభ్​మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్​తో పటిష్ఠంగా టీమ్ఇండియా బ్యాటింగ్​ లైనప్​కు 150 పరుగుల లక్ష్యం ఓ లెక్క కాదు. కానీ తొలి టీ20లో వీరు క్రీజులో కుదురుకోడానికే చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో టీమ్ఇండియా యువ జట్టు బ్యాటింగ్​లో చాలా మెరుగుపడాల్సి ఉందంటూ.. పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వీరి నుంచి ఫ్యాన్స్.. పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు.

ఇక ఆసియా కప్​, ప్రపంచ కప్​ సమీపిస్తున్న తరుణంలో.. నాణ్యమైన ఆట తీరుతో టీమ్ఇండియా యువ బ్యాటర్లు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య టచ్​లోకి వస్తే.. ఛేదనలో భారత్​కు ఇబ్బందులుండవ్. మొదటి మ్యాచ్​లో అదరగొట్టిన తెలుగుతేజం తిలక్ వర్మ.. ఈ మ్యాచ్​లోనూ ఫామ్​ కొనసాగిస్తే భారత్​కు భారీ స్కోర్ పక్కా. అయితే వీక్​గా కనిపిస్తున్న లోయార్డర్​లో ఆల్​రౌండర్​ అక్షర్ పటేల్ రాణించాల్సిన అవసరం ఉంది. ఇక టీ20ల్లో జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఆరాటపడుతున్నాడు యంగ్ స్టార్ యశస్వి జైస్వాల్.​ మరి టీమ్ మేనేజ్​మెంట్ అతడికి అవకాశం ఇస్తుందా అనేది ప్రశ్నార్థకం.

తొలి టీ20లో నెగ్గిన ఆతిథ్య విండీస్ జట్టు ఉత్సాహంగా కనిపిస్తోంది. మొదట బ్యాటింగ్​లో అంతంత మాత్రంగానే రాణించిన విండీస్.. రెండో ఇన్నింగ్స్​లో బౌలింగ్​తో ఆకట్టుకుంది. కానీ రెండో మ్యాచ్ జరిగే ప్రావిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్ రికార్డులు పేలవంగా ఉన్నాయి. ఇక్కడ విండీస్ 11 మ్యాచ్​లు ఆడగా.. మూడింట గెలిచి, ఐదింట్లో ఓడింది. కాగా మూడు మ్యాచ్​లు వర్షం కారణంగా రద్దయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.