ETV Bharat / sports

IND VS WI: సూర్యకుమార్​ హాఫ్​సెంచరీ.. విండీస్​ లక్ష్యం ఎంతంటే? - వెస్టిండీస్​ లక్ష్యం

IND VS WI second ODI: వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్​ఇండియా.. వెస్టిండీస్​ ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బ్యాటర్లలో సూర్యకుమార్​ యాదవ్​(64) అర్ధ శతకంతో మెరిశాడు.

teamindia vs westindies
టీమ్​ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​ో
author img

By

Published : Feb 9, 2022, 5:24 PM IST

IND VS WI second ODI: వెస్టిండీస్​తో జరుగుతోన్న రెండో వన్డేలో టీమ్​ఇండియా బ్యాటర్లు ఆచీతూచీ ఆడారు. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేశారు. సూర్యకుమార్​ యాదవ్​(64) హాఫ్​ సెంచరీతో మెరవగా.. మిగలిన వారు ఫర్వాలేదనిపించారు. విండీస్​ బౌలర్లలో ఒడియన్​ స్మిత్​ 2, అల్జార్రీ జోసెఫ్​ 2, కీమర్​ రోచ్​, జాసన్​ హోల్డర్​, అకీల్​ హోసేన్​, ఫబియన్​ అలెన్​ తలో వికెట్​ తీశారు.

మ్యాచ్​ సాగిందిలా..

టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన టీమ్​ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోచ్​ వేసిన మూడో ఓవర్​ చివరి బంతికి కెప్టెన్​ రోహిత్​ శర్మ(5) పెవిలియన్​ చేరాడు. అతడు వికెట్ల వెనుక కీపర్​కు చిక్కడం వల్ల భారత్​ 9 పరుగుల వద్ద తొలి వెకెట్​ నష్టపోయింది. ఇక ఓపెనర్​గా వచ్చిన రిషభ్​ పంత్​(18).. ఓడియన్​ స్మిత్​ వేసిన 11.1 ఓవర్​కు భారీ షాట్​కు యత్నించి హోల్డర్​ చేతికి చిక్కాడు. దీంతో భారత్​ 39 పరుగుల వద్ద రెండో వికెట్​ను కోల్పోయింది. 12 ఓవర్​లో కోహ్లీ(18) ఔట్​ అయ్యాడు.

ఇక జాగ్రత్తగా ఆడుతున్న కేఎల్​ రాహుల్​(49).. కీమర్​ రోచ్​ వేసిన 30వ ఓవర్​ నాలుగో బంతికి పరుగు తీసే క్రమంలో రనౌట్ అయ్యాడు. ధనాధన్​ ఇన్నింగ్స్​ ఆడిన సూర్యకుమార్​ యాదవ్​(64) ఫేబియన్​ అలెన్​ వెసిన 39వ ఓవర్​ ఐదో బంతికి క్యాచ్​ ఇచ్చి ఔట్​ అయ్యాడు. శార్దూల్​ ఠాకూర్​(8), మహ్మద్​ సిరాజ్​(3), దీపక్​ హుడా(29) పెవిలియన్​ చేరారు.

ఇదీ చూడండి: ఐపీఎల్​ ప్రారంభ మ్యాచ్​లకు ఆ స్టార్స్​ దూరం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.