ETV Bharat / sports

నేను భయపడే రకం కాదు.. ఎలా ఆడాలో తెలుసు!: రోహిత్​ - టీమ్​ఇండియా వర్సెస్​ వెస్టిండీస్​

Rohith comments on winning IND VS WI: వెస్టిండీస్​పై మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను గెలవడంపై హర్షం వ్యక్తం చేశాడు కెప్టెన్​ రోహిత్​ శర్మ. క్లిష్ట పరిస్థితుల్లో యువ క్రికెటర్లు జట్టును కాపాడారని ప్రశంసించాడు.

rohith sharma
రోహిత్​ శర్మ
author img

By

Published : Feb 21, 2022, 10:28 AM IST

Updated : Feb 21, 2022, 11:46 AM IST

Rohith comments on winning IND VS WI: వెస్టిండీస్​తో జరిగిన మూడో టీ20లోనూ గెలిచి సిరీస్​ను సొంతం చేసుకుంది టీమ్ఇండియా. ఆఖరి మ్యాచ్​లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై కెప్టెన్​ రోహిత్​ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. యువ ఆటగాళ్లు అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు.

"ఛేదించగలిగే పూర్తిస్థాయి జట్టు ఇక్కడ లేకపోయినప్పటికీ ఛేదనలో గెలవాలనుకున్నాం. ఎందుకంటే మిడిలార్డర్​లో అందరూ కొత్తవాళ్లే. అలానే ఈ జట్టు ఛేదన కూడా చేయగలదని నిరూపించింది. ఈ సిరీస్​ గెలవడం ఆనందంగా ఉంది. మేము అనుకున్నది సాధించగలిగాం. ఈ మ్యాచ్​కు పలువురు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. దీంతో ఈ పోరులో తీవ్ర ఒత్తిడి ఎదురైతే ఎలా పోరాడాలో ముందే మాట్లాడుకున్నాం. ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నారు. ఇది అభినందించదగ్గ విషయం. ముఖ్యంగా మిడాలార్డర్​ బ్యాటర్లు వన్డేలతో పాటు ఈ సిరీస్​లోనూ రాణించారు. బౌలింగ్​లో హర్షల్​ పటేల్​ అదరగొట్టాడు. ఈ మ్యాచ్​లో అవేశ్​ ఖాన్​ అరంగేట్రం చేశాడు. శార్దూల్​ జట్టులోకి వస్తూ పోతూ ఉన్నాడు. దీంతో వాళ్లకు అవకాశం ఇవ్వడం పెద్ద సవాలు లాంటిది. వెస్టిండీస్​ లాంటి జట్టుపై ఆడటం అంటే బ్యాటింగ్​, బౌలింగ్​కు పరీక్ష పెట్టినట్లే. వాళ్లు బ్యాటింగ్​ బాగా చేశారు. అయినా చివరి రెండు మ్యాచ్‌ల్లో వాళ్లను ఓడించడం సవాల్​గా అనిపించింది. ఇక శ్రీలంక సిరీస్‌కు ఇద్దరు ఆటగాళ్లు మిస్సయ్యారు. వారిని తాజాగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. అలాగే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ కూడా ఉండటం వల్ల దాన్ని దృష్టిలోపెట్టుకొని కొంతమంది యువకులకు వ్యక్తిగతంగా అవకాశాలివ్వాలని భావించాం. ఇక శ్రీలంకతో పరిస్థితులు మరోలా ఉంటాయి, ఆ జట్టుతో సవాళ్లు ఎదురువుతాయి. అయితే, నేను ప్రత్యర్థిని చూసి భయపడే రకం కాదు. ఒక జట్టుగా మేం ఎలా ఆడగలమనేదే ఆలోచిస్తా. ప్రస్తుతం మా జట్టులో ఫీల్డింగ్‌, క్యాచింగ్‌ విషయాల్లో తప్పులు సరిదిద్దుకోవాల్సి ఉంది. త్వరలోనే వాటిని సరిచేసుకుంటామనే నమ్మకం ఉంది"

-కెప్టెన్​ రోహిత్​ శర్మ.

కాగా, ఈనెల 24న భారత్-శ్రీలంక టీ20 సిరీస్​ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​కు లఖ్​నవూ ఆతిథ్యమివ్వనుంది. తర్వాత రెండు మ్యాచులు ధర్మశాలలో జరగనున్నాయి. అనంతరం మార్చి 4-8 వరకు మొహలీలో తొలి టెస్టు, మార్చి 12-16 వరకు బెంగళూరులో రెండో టెస్టును బీసీసీఐ నిర్వహిస్తుంది.

ఇదీ చూడండి: సూర్య కుమార్‌ సిక్సర్ల వర్షం.. పొలార్డ్‌ చప్పట్లు

Last Updated : Feb 21, 2022, 11:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.