ETV Bharat / sports

వెస్టిండీస్​తో టీ-20 సిరీస్- వికెట్ కీపర్ పంత్​కు ప్రమోషన్ - IND vs WI pant

IND vs WI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా రిషబ్ పంత్ నియమితుడయ్యాడు. కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ గాయాలతో దూరమైన కారణంగా పంత్​ను ఎంపిక చేశారు.

IND vs WI
ఇండియా వర్సెస్ వెస్టిండీస్​
author img

By

Published : Feb 15, 2022, 9:49 AM IST

Updated : Feb 15, 2022, 9:57 AM IST

IND vs WI: వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌ రిషబ్‌ పంత్‌ వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు వైస్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రాహుల్‌ గైర్హాజరీలో పంత్‌కు వైస్‌ కెప్టెన్సీ దక్కింది.

ఆఫ్‌స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ తొడకండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. విండీస్‌తో మూడో వన్డే సందర్భంగా అతడు గాయపడ్డట్లు బీసీసీఐ తెలిపింది. అతడి స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ జట్టులో స్థానం సంపాదించాడు. కేఎల్‌ రాహుల్‌, అక్షర్‌ పటేల్‌ గాయాలతో ఇప్పటికే సిరీస్‌కు దూరమయ్యారు. వారి స్థానాల్లో రుతురాజ్​ గైక్వాడ్​, దీపక్​ హూడాకు అవకాశమివ్వనున్నట్లు తెలిపింది బీసీసీఐ.

వెస్టిండీస్​తో కోల్​కతా వేదికగా మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్ బుధవారం(16-02-2022) నుంచి ప్రారంభం కానుంది. రోహిత్ శర్మ సారథ్యంలో టీమ్​ఇండియా వెస్టిండీస్​తో తలపడనుంది.

ఇదీ చదవండి: వెస్టిండీస్​తో టీ20 సిరీస్​.. వాషింగ్టన్ సుందర్​ దూరం!

Last Updated : Feb 15, 2022, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.