ETV Bharat / sports

IND vs WI T20: టాస్​ గెలిచిన విండీస్​.. భారత్​ బ్యాటింగ్

India vs West Indies: వెస్టిండీస్​తో రెండో టీ20లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్​కు దిగనుంది. ఈ మ్యాచ్​లో గెలిచి టీ20 సిరీస్​ సొంతం చేసుకోవాలి రోహిత్​ సేన భావిస్తోంది.

IND vs WI T20
భారత్ వెస్టిండీస్ టీ20
author img

By

Published : Feb 18, 2022, 6:38 PM IST

Updated : Feb 18, 2022, 6:51 PM IST

India vs West Indies: విండీస్​పై తొలి టీ20 గెలిచిన ఉత్సాహంలో ఉన్న టీమ్​ఇండియా రెండో టీ20కి సిద్ధమైంది. కోల్‌కతా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో విండీస్​ టాస్ గెలిచింది. దీంతో టీమ్​ఇండియాను బ్యాటింగ్​​కు ఆహ్వానించింది.

వన్డే సిరీస్‌లో వెస్టిండీస్‌ను వైట్​వాష్​ చేసి.. తొలి టీ20లో కూడా ఘన విజయం సాధించిన రోహిత్​ సేన ఈ మ్యాచ్​ గెలిచి సిరీస్​ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు తమకు అచ్చొచ్చిన ఫార్మాట్‌లో భారత్‌కు గట్టిపోటీ ఇవ్వాలని కరీబియన్‌ జట్టు పట్టుదలతో ఉంది.

ఈ మ్యాచ్​ విండీస్ స్టార్ ఆల్​రౌండర్​కు పొలార్డ్​కు 100వ టీ20 కావడం విశేషం. అలానే ఈ మ్యాచ్​లో ఇరుజట్లు మార్పుల్లేకుండానే బరిలో దిగుతున్నాయి.

భారత జట్టు: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్​), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (కీపర్​), వెంకటేష్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, చాహల్

వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్ (కీపర్​), రోవ్‌మన్ పావెల్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్​), రోస్టన్ చేజ్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసేన్, ఓడియన్ స్మిత్, హోల్డర్, షెల్డన్ కాట్రెల్

ఇదీ చూడండి : టీ20 రికార్డుకు చేరువలో కోహ్లీ, రోహిత్​!

Last Updated : Feb 18, 2022, 6:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.