IND vs WI 2nd T20: తొలి టీ20లో విండీస్‌పై టీమ్ఇండియా ఘన విజయంతో అభిమానులు రెండో టీ20కి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ అభిమానులకు, ముఖ్యంగా రోహిత్-కోహ్లీ అభిమానులకు ప్రత్యేకమయ్యే అవకాశం ఉంది. వీరిద్దరూ ఓ టీ20 రికార్డుకు చేరువలో ఉండటమే ఇందుకు కారణం. ఈ టీ20తో వీరిద్దరిలో ఒకరు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలవనున్నారు. ప్రస్తుతం అగ్రస్థానంలో 3299 పరుగులతో కివీస్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ కొనసాగుతున్నాడు.
ఎన్ని పరుగులు చేయాలంటే?
కెప్టెన్ రోహిత్ శర్మ ఈ రికార్డును అందుకోవాలంటే మరో 63 పరుగులు చేయాల్సి ఉంది. తన కెరీర్లో ఇప్పటివరకు 120 టీ20లు ఆడిన రోహిత్ 33 సగటుతో 3237 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు రోహిత్ పేరునే ఉంది.
విరాట్ కోహ్లీ ఈ రికార్డు చేరుకోడానికి 56 పరుగులు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 96 టీ20లు ఆడిన కోహ్లీ 51 సగటుతో 3244 పరుగులు చేశాడు. ఇందులో 29 హాఫ్‌సెంచరీలు ఉన్నాయి.
విండీస్‌పై తొలి టీ20లో వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ ఈ రికార్డును అందుకుంటాడో.. లేక రన్‌మెషీన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి వచ్చి ఈ రికార్డును బద్దలు కొడతాడో అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇదీ చూడండి : Virat Kohli: కోహ్లీ ఇలాంటి రిస్క్ ఎప్పుడూ తీసుకోలేదు: చోప్రా