IND Vs WI 1st T20 Tilak Varma : టీమ్ఇండియా యువ ఆటగాడు, హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన తిలక్ వర్మ.. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి అందరినీ అకట్టుకున్నాడు. భారత్ బ్యాటర్లు శుభమన్ గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట తిలక్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్ కిషన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ.. తన ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతిని సైతం నేరుగా స్టాండ్స్‌గా తరలించాడు.
IND Vs WI Tilak Varma Debut : ఓవరాల్‌గా 22 బంతులు ఎదుర్కొన్న వర్మ 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. భారత ఇన్నింగ్స్‌లో వర్మదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఈ హైదరాబాదీ కుర్రాడులో కొంచెం కూడా భయం కన్పించలేదని నెటిజన్లు అంటున్నారు. అతడు ఆడిన ఆట తీరు గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని కొనియాడుతున్నారు. అతడి బ్యాటింగ్ సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా భారత్ తరపున టీ20ల్లో అరంగేట్రం చేసిన 104 ఆటగాడిగా తిలక్ నిలిచాడు.
-
Takes a blinder.
— FanCode (@FanCode) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Hits back to back sixes to kick off his innings.
A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR
">Takes a blinder.
— FanCode (@FanCode) August 3, 2023
Hits back to back sixes to kick off his innings.
A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSRTakes a blinder.
— FanCode (@FanCode) August 3, 2023
Hits back to back sixes to kick off his innings.
A dashing debut for Tilak Varma 😎#INDvWIAdFreeonFanCode #WIvIND pic.twitter.com/VpcKOyfMSR
ఉత్కంఠ పోరులో ఓటమి చెంది..
IND Vs WI 1st T20 : కాగా, ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా నాలుగు పరుగుల తేడాతో వెస్టిండీస్ చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర్‌లో టీమ్ఇండియా విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్ మొదటి బంతికి కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి చవి చూడాల్సి వచ్చింది. భారత ఇన్నింగ్స్‌లో అరంగేట్ర ఆటగాడు తిలక్ వర్మ(39) మినహా మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, చాహల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్య, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ సాధించారు.
-
West Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. 👍 👍
— BCCI (@BCCI) August 3, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoO
">West Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. 👍 👍
— BCCI (@BCCI) August 3, 2023
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoOWest Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. 👍 👍
— BCCI (@BCCI) August 3, 2023
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoO