ETV Bharat / sports

జడ్డూ ఆల్​రౌండ్ షో... లంకపై భారత్​ ఘన విజయం - india today match

IND VS SL: శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తొలుత 174 పరుగులు చేసి ఆలౌటైన లంక ఫాలోఆన్ లోనూ చేతులెత్తేసింది. ​178 పరుగులకు కుప్పకూలింది. ఫలితంగా భారత్.. ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

india win
భారత్​ ఘన విజయం
author img

By

Published : Mar 6, 2022, 4:12 PM IST

Updated : Mar 6, 2022, 5:01 PM IST

IND VS SL: శ్రీలంకతో తొలి టెస్ట్​లో భారత్​ ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్​లో 174 పరుగులకే ఆలౌటైన లంక ఫాలో ఆన్​లోనూ చతికిలపడింది. ఫాలోఆన్​ బ్యాటింగ్​ దిగిన శ్రీలంక జట్టు 178 పరుగులు చేసి కుప్పకూలింది. ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసి లంకను ఆలౌట్​ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రవిచంద్రన్​ అశ్విన్​ 4 వికెట్లు, మహ్మద్ షమీ 2 వికెట్లు తీశారు. దీంతో మూడు రోజుల్లోనే మ్యాచ్ ముగిసింది.

happy faces of indian team
భారత జట్టు
india fan into the stadium
మైదానంలోకి దూసుకొచ్చిన భారత అభిమాని

మూడో రోజు ఆటలో భాగంగా తొలి సెషన్​లో భారత బౌలర్లు అదరగొట్టారు. జడేజా ఐదు వికెట్లు తీశాడు. నిస్సంక (61*) ఒక్కడే అర్ధ శతకంతో రాణించాడు. మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆదివారం ఓవర్​నైట్​ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన శ్రీలంక మరో 66 పరుగులు జోడించి మిగిలిన ఆరు వికెట్లు కోల్పోయింది. అంతకుముందు ఓవర్​నైట్​ బ్యాటర్లు అసలంక, నిస్సంక తొలి గంట సేపు జాగ్రత్తగా ఆడారు. అయితే, ఈ జోడీని బుమ్రా విడదీశాడు. జట్టు స్కోరు 161 పరుగుల వద్ద అసలంకను ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపడం వల్ల లంక సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం భారత బౌలర్లు చెలరేగి 13 పరుగుల తేడాతో మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలోనే జడేజా ఐదు వికెట్ల ఘనత సాధించాడు. బుమ్రా, అశ్విన్​ తలో రెండు వికెట్లు తీయగా.. షమీ ఓ వికెట్​ దక్కించుకున్నాడు. దీంతో భారత్​ తొలి ఇన్నింగ్స్​లో 400 పరుగుల సంపూర్ణ ఆధిక్యం లభించింది. వెంటనే శ్రీలంకను ఫాలోఆన్​కు దించింది భారత్.

jadeja cheering fans
అభిమానులను ఉత్తేజపరుస్తున్న జడేజా

మరోవైపు, లెజెండరీ క్రికెటర్​ కపిల్​దేవ్​ రికార్డును బ్రేక్ చేశాడు స్టార్ స్పిన్నర్​ రవిచంద్రన్ అశ్విన్​. ఆదివారం శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా 436 వికెట్లతో సుదీర్ఘ ఫార్మాట్​లో భారత తరపున రెండో అత్యధిక వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఈ క్రమంలోనే కపిల్​ను (131 మ్యాచ్​ల్లో 434 వికెట్లు) అధిగమించాడు. తన 85వ మ్యాచ్​లోనే అశ్విన్​ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఈ జాబితాలో 132 మ్యాచ్​ల్లో 619 వికెట్లతో స్పిన్ దిగ్గజం అనిల్​ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు.

jadeja
వికెట్ తీసిన ఆనందంలో జడేజా

భారత్​ తొలి ఇన్నింగ్స్​లో ఆల్​రౌండర్​ రవీంద్ర జడేజా 175 పరుగుల చేయడం వల్ల 574 పరుగలకు డిక్లెర్ చేసింది. కీపర్​ రిషభ్​ పంత్​ 96, రవిచంద్రన్​ అశ్విన్​ 61, విరాట్​ కోహ్లీ 45 పరుగులు చేశారు.

ఇదీ చదవండి: కపిల్ దేవ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అశ్విన్ అరుదైన ఘనత

Last Updated : Mar 6, 2022, 5:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.