ETV Bharat / sports

Ind vs Sl: అచ్చొచ్చిన స్టేడియంలోనైనా  కోహ్లీ శతక్కొడతాడా? - భారత్​ శ్రీలంక రెండో టెస్టు

Ind vs Sl: బెంగళూరు వేదికగా జరగనున్న భారత్​​-శ్రీలంక రెండో టెస్టు మ్యాచ్​లో మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ఎలా ఆడతాడనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల మొహాలీ వేదికగా జరిగిన మొదటి టెస్టులో కోహ్లీ వందో టెస్టులో 45 పరుగులకే పెవిలియన్​ చేరి అభిమానులకు నిరాశ మిగిల్చాడు. ఈ సారైనా కోహ్లీ తన 71వ సెంచరీ కొడతాడో లేదో చూడాలి.

కోహ్లీ
virat kohli
author img

By

Published : Mar 11, 2022, 2:33 PM IST

Updated : Mar 12, 2022, 8:45 AM IST

Ind vs Sl: భారత క్రికెట్​ జట్టు బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా శ్రీలంకతో శనివారం పింక్​ బాల్​ టెస్టు ఆడనుంది. అయితే ఈ మ్యాచ్​లో మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎలా ఆడతాడనేది అభిమానుల్లో ఆసక్తిగా రేపుతోంది. ఇప్పటివరకు భారత్‌ ఆడిన మూడు పింక్‌బాల్‌ టెస్టుల్లో కోహ్లీ టీమ్‌ఇండియా తరఫున శతకం సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.

పింక్‌బాల్‌ టెస్టుల్లో అతడు 2019లో కోల్‌కతా వేదికగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనే శతకం సాధించాడు. తర్వాత ఒక్కసారి కూడా మూడంకెల స్కోర్‌ చేయకపోవడం గమనార్హం. దీంతో మాజీ సారథికి పింక్​ బాల్​తో అదే చివరి శతకంగా మారింది. ఇక అప్పటి నుంచి ఎంత బాగా ఆడినా విరాట్‌ మరో సెంచరీ చేయలేకపోయాడు. ఇక ఇటీవల మొహాలీ వేదికగా జరిగిన తొలి టెస్టులో 45 పరుగులు చేసి.. చివరికి అర్ధశతకం ముందు ఔటయ్యాడు. దీంతో వందో టెస్టులోనైనా శతకం సాధిస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే విరాట్​కు అచ్చొచ్చిన చినస్వామి స్టేడియంలో రెండో టెస్టు జరుగుతోంది కాబట్టి ఈ సారైనా సెంచరీ చేస్తాడేమోనని అభిమానులు వేచి చూస్తున్నారు. మరి కోహ్లీ ఏం చేస్తాడో చూడాలి..

indian cricket team
భారత క్రికెట్​ జట్టు

2022లో సొంతగడ్డపై భారత్​కు ఇదే చివరి టెస్ట్​..

2022లో టీమ్​ఇండియాకు సొంతగడ్డపై ఇదే చివరి టెస్టు మ్యాచ్. లంక సిరీస్ తర్వాత ప్రస్తుత ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​లో భాగంగా మరో ఏడు టెస్టులు ఆడాల్సి ఉంది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌కు, ఆపై 2023లో నాలుగు టెస్టుల సిరీస్​ కోసం ఆస్ట్రేలియాకు భారత్​ జట్టు వెళుతుంది. గతేడాది ఇంగ్లండ్‌ టూర్‌లో మిగిలిన ఒక టెస్టు కూడా ఇంకా ఆడాల్సి ఉంది. WTC ఫైనల్‌కు టీమ్​ఇండియా అర్హత సాధించాలంటే ఈ టెస్టు మ్యాచ్‌లన్నింటినీ గెలవాలి.

ఇదీ చదవండి: టెస్టుల్లోనూ వీర బాదుడు.. అత్యధిక సిక్సర్ల వీరులు వీళ్లే..

Last Updated : Mar 12, 2022, 8:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.