IND VS SL: టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు సాధించిన 8వ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్‌ను (439 వికెట్లు) అధిగమించాడు.
బెంగళూరులో శ్రీలంకపై పింక్ టెస్టులో తన 440వ టెస్టు వికెట్ పడగొట్టాడు అశ్విన్. ప్రస్తుతం అతడు భారత్ తరపున సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్ల వీరులు..
- ముత్తయ్య మురళీధరణ్-800
- షేన్ వార్న్-708
- జేమ్స్ అండర్సన్-640
- అనిల్ కుంబ్లే-619
- గ్లెన్ మెక్‌గ్రాత్- 563
- స్టువర్ట్ బ్రాడ్-537
- కోర్ట్నీ వాల్ష్- 519
- అశ్విన్-440
- డేల్ స్టెయిన్-439
- కపిల్ దేవ్-434
తొలి బౌలర్‌గానూ..
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గానూ అశ్విన్ ఘనత దక్కించున్నాడు. డేనైట్ టెస్టుల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గానూ నిలిచాడు అశ్విన్ (18 వికెట్లు). అతడి తర్వాతి స్థానంలో అక్షర్ పటేల్ (14) ఉన్నాడు.
స్వదేశంలో అజేయంగా టీమ్ఇండియా..
- ఇప్పటివరకు భారత్‌లో 22 టెస్టులాడిన శ్రీలంక.. ఒక్క మ్యాచ్‌లోనూ విజయం సాధించలేదు.
- శ్రీలంకతో టెస్టును సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి 2021/21 హోం సీజన్‌ను అజేయంగా ముగించింది టీమ్ఇండియా. ఈ కాలంలో మొత్తం 4టెస్టులు ఆడిన భారత్.. ముడింట గెలిచి ఒక మ్యాచ్ డ్రాగా ముగించింది. ఆడిన మూడు వన్డేలు, 9 టీ20ల్లోనూ విజయం సాధించింది.
- స్వదేశంలో భారత్‌కు ఇది వరుసగా 15వ టెస్టు సిరీస్ విజయం. 2012లో చివరిసారిగా ఇంగ్లాండ్ చేతిలో సొంతగడ్డపై ఓడింది టీమ్ఇండియా.
ఇదీ చూడండి: INDIA VS SRI LANKA: గులాబీ టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం