ETV Bharat / sports

INDvsSL: లంకతో మిగిలిన టీ20లకు వారందరూ దూరం - యుజ్వేంద్ర చాహల్

శ్రీలంకతో రెండో టీ20కి ముందు టీమ్ఇండియాకు షాక్​ తగిలింది. కరోనా సోకిన కృనాల్​ పాండ్యాతో పాటు మరో ఎనిమిది మంది ఆటగాళ్లు లంకతో జరిగే మిగిలిన మ్యాచ్​లకు అందుబాటులో ఉండట్లేదు. ఈ జాబితాలో సూర్య, ఇషాన్ కిషన్, చాహల్, చాహర్, గౌతమ్, పృథ్వీ, హర్దిక్, మనీష్​ ఉన్నారు.

India vs Sri Lanka
ఇండియా vs శ్రీలంక
author img

By

Published : Jul 28, 2021, 6:10 PM IST

శ్రీలంకతో రెండో టీ20కి ముందు టీమ్ఇండియాకు షాక్​ తగిలింది. కృనాల్​ పాండ్యాతో సన్నిహితంగా మెలిగిన క్రికెటర్లు చివరి రెండు మ్యాచ్​లకు దూరం కానున్నారు. వారి స్థానంలో కుర్రాళ్లకు అవకాశమివ్వనుంది జట్టు.

కృనాల్​కు కరోనా నిర్ధరణ కావడం వల్ల మంగళవారం జరగాల్సిన రెండో టీ20.. బుధవారానికి వాయిదా పడింది. అతడితో సన్నిహితంగా ఉన్న హర్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, పృథ్వీ షా, దీపక్ చాహర్, క్రిష్ణప్ప గౌతమ్, ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండే ఈ రోజు మ్యాచ్​కు దూరం కానున్నారు. వీరి స్థానంలో దేవదత్ పడిక్కల్, ఇషాన్​ పోరెల్, సందీప్ వారియర్, అర్ష్​దీప్​ సింగ్, సాయి కిషోర్, సిమ్రాన్​జీత్​ సింగ్.. జట్టుతో కలవనున్నారు. మిగిలిన రెండు మ్యాచ్​లకు ఈ స్క్వాడ్​తోనే ఆడనుంది టీమ్ఇండియా.

ఈ ఎనిమిది ఆటగాళ్లకు నిర్వహించిన ఆర్టీ పీసీఆర్​ పరీక్షల్లో​ నెగెటివ్​ వచ్చింది. అయినప్పటికీ కొవిడ్ మార్గదర్శకాల ప్రకారం వారు ఐసోలేషన్​లో ఉండాల్సిందే. వీరితో పాటు పలువురు స్టాఫ్ సభ్యులు కూడా ఐసోలేషన్​లో ఉన్నారు.

సిరీస్​లో మూడో టీ20 గురువారం షెడ్యూల్ ప్రకారం జరగనుంది. అంటే వెంటవెంటనే రెండు రోజుల్లో రెండు మ్యాచ్​లు నిర్వహిస్తారన్న మాట. పొట్టి సిరీస్​లో ధావన్​ సేన ఇప్పటికే 1-0తో ముందంజలో ఉంది.

ఇదీ చదవండి: ICC Rankings: మెరుగైన భూవీ, చాహల్, చాహర్ స్థానాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.