ETV Bharat / sports

IND Vs SL Asia Cup Finals : నిప్పులు చెరుగుతున్న బుమ్రా- సిరాజ్​.. 12 పరుగులకే 6 వికెట్లు డౌన్! - ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్​

IND Vs SL Asia Cup Finals : 2023 ఆసియాకప్​ ఫైనల్ మ్యాచ్​కు వరుణుడు రానే వచ్చాడు. టాస్ పూర్తయి.. మ్యాచ్​కు రెడీ అవుతున్న నేపథ్యంలో చిన్నపాటి చినుకులు స్టేడియాన్ని పలకరించాయి. దీంతో మైదానాన్ని కవర్లతో పూర్తిగా కప్పి ఉంచారు. అయితే కాసేపటికి వరుణుడు బ్రేక్​ ఇవ్వడం వల్ల మ్యాచ్​ స్టార్ట్​ అయ్యింది. ఆ వివరాలు మీ కోసం..

IND Vs SL Asia Cup Finals
IND Vs SL Asia Cup Finals
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 3:26 PM IST

Updated : Sep 17, 2023, 4:51 PM IST

IND Vs SL Asia Cup Finals : 2023 ఆసియా కప్​ ఫైనల్​ మ్యాచ్​లో టీమ్ఇండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరుగుతున్నాడు. పొడిగా ఉన్న పిచ్​పై పదునైన బంతులతో లంకను ఓ ఆటాడేసుకుంటున్నాడు. సిరాజ్, బుమ్రా ధాటికి లంక 12 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

ఏకంగా నలుగురు డకౌట్.. సిరాజ్, బుమ్రా పేస్​ను ఎదుర్కొలేక లంక బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. ఇలా క్రీజులోకి వచ్చి అలా పెవిలియన్​కు క్యూ కడుతున్నారు. భారత పేస్ దళం దెబ్బకు ప్రత్యర్థి జట్టులో నలుగురు బ్యాటర్లు పరుగుల ఖాతా కూడా తెరవలేదు. ఓపెనర్ కూశాల్ పెరీరా (0) ను బుమ్రా ఔట్​ చేయగా.. సిరాజ్.. సమరవిక్రమ (0), చరిత్ అసలంక (0), దసున్ శనక (0)ను వెనక్కి పంపాడు.

అంతకుముందు టాస్ గెలిచిన శ్రీలంక.. బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ వర్షం కారణంగా మ్యాచ్​.. సమయానికి ప్రారంభం కాలేదు. 30 నిమిషాల తర్వాత ఆట ప్రారంభమైంది. ఇక మ్యాచ్​ ఆరంభం నుంచే భారత బౌలర్లు చెలరేగుతున్నారు.

Asia Cup 2023 Trophy Tour : ఆసియా క్రికెట్ కౌన్సిల్.. 'ట్రోఫీ టూర్' పేరుతో ప్రతిష్ఠాత్మకమైన ఆసియా కప్ ట్రోఫీ శనివారం కొలంబో నగర వీధుల్లో తిప్పారు. ఈ ర్యాలీలో క్రికెట్ ఫ్యాన్స్​ పాల్గొని ట్రోఫీతో సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆదివారం జరిగే ఫైనల్స్​లో విజేతగా నిలిచిన జట్టు ఈ ట్రోఫీని ముద్దాడనుంది. అయితే ఇప్పటికే 7 సార్లు (6 వన్డే, 1 టీ20 ఫార్మాట్) ట్రోఫీని గెలుచుకున్న భారత్.. ఎనిమిదో టైటిల్​ను గెలుచుకోవాలని తహతహలాడుతోంది. మరోవైపు ఆరు టైటిళ్లతో ఉన్న శ్రీలంక మరో టైటిల్ గెలిచి భారత్ రికార్డును సమం చేయాలని భావిస్తోంది.

భారత్‌ తుది జట్టు: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్, విరాట్ కోహ్లి, రాహుల్‌, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా,వాషింగ్టన్​ సుందర్‌, కుల్‌దీప్‌ యాదవ్, జస్​ప్రీత్​ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌.

శ్రీలంక తుది జట్టు: నిశాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, అసలంక, శానక (కెప్టెన్), ధనంజయ డిసిల్వా, వెల్లలాగె, హేమంత, మధుషన్, పతిరన.

Ind Vs SL Asia Cup Finals : టాస్ గెలిచిన లంక.. బౌలింగ్​కి దిగిన టీమ్ఇండియా​

IND vs SL Asia Cup 2023 Final : ఆసియాకప్‌ ఫైనల్‌ నేడే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే?

Last Updated : Sep 17, 2023, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.