ETV Bharat / sports

IND vs SL Asia Cup 2023 Final : ఆసియాకప్‌ ఫైనల్‌ నేడే.. రికార్డులు ఎలా ఉన్నాయంటే? - Ind vs Sl Asia Cup 2023 Final pitch report

IND vs SL Asia Cup 2023 Final : 2023 ఆసియా కప్ ఫైనల్‌ మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. తుది పోరులో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్​కు సంబంధించిన బలాబలాలు, రికార్డులు, ఇతర విశేషాలు తెలుసుకుందాం..

IND vs SL Asia Cup 2023 Final :  ఆసియాకప్‌ ఫైనల్‌ నేడే..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2023, 8:03 AM IST

IND vs SL Asia Cup 2023 Final : సొంత గడ్డపై జరిగే వన్డే ప్రపంచకప్‌లో విజేతగా నిలవాలని టీమ్‌ఇండియా గట్టి పట్టుదలతో ఉంది. అదే సమయంలో భారత జట్టు గెలవాలని అభిమానులు కూడా అంతే బలంగా కోరుకుంటున్నారు. అయితే మరి ఆ కప్​ను అందుకునే దిశగా టీమ్​ ఇండియా సరైన అడుగులు వేస్తోందో లేదో తెలుసుకోవడానికి ఇప్పుడో పరీక్ష ఎదురైంది. అదే ఆసియా కప్‌ ఫైనల్‌. మరి కొన్ని గంటల్లో ఇది జరగనుంది. ఈ సందర్భంగా మ్యాచ్​కు సంబంధించిన బలాబలాలు, రికార్డులు, ఇతర విశేషాలు తెలుసుకుందాం..

  • వరుస విజయాలతో ఈజీగానే ఫైనల్‌ అర్హత సాధించిన టీమ్​ఇండియా.. నామమాత్రపు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ చేతిలో ఓడింది. ఇప్పుడీ తుది పోరులో శ్రీలంకతో తలపడనుంది. ఇందులో విజయం సాధిస్తే.. ప్రపంచకప్‌ ముంగిట టీమ్‌ఇండియాలో ఆత్మవిశ్వాసం పెరిగినట్టే.
  • ఐదేళ్లుగా రెండు కన్నా ఎక్కువ టీమ్స్​ పోటీ పడే ఏ టోర్నీలోనూ టీమ్‌ఇండియా నెగ్గలేదు. మరి ఆసియా కప్‌లో ఏం చేస్తుందో..
  • ప్రస్తుతం ఈ టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన చూస్తే.. టీమ్​ఇండియానే ఫేవరెట్‌. కానీ తమతో అంత ఈజీ కాదని.. సూపర్‌-4 మ్యాచ్​లో బలమైన పాక్​పై గెలిచి చూపించారు. పైగా సొంతగడ్డ కాబట్టి.. గట్టి సవాలే.
  • ఈ టోర్నీలో పాకిస్థాన్‌తో సూపర్‌-4 మ్యాచ్‌లో తప్ప ప్రధాన బ్యాటర్లు నిలకడగా ఆడలేదు. రీసెంట్​గా బంగ్లాపై సూపర్ సెంచరీ బాదిన శుభమన్​.. అంతకుముందు రెండు మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలు బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు ఓపెనర్లు మరోసారి తాజా మ్యాచ్​లో మంచి శుభారంభాన్ని అందించాల్సిన అవసరం ఉంది. అలా జరిగితే సగం విజయం సాధించినట్లే.
  • సూపర్‌-4 మ్యాచ్‌లో లంకపై ఆకట్టుకోలేకపోయినా కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌ ఆడాల్సిన అవసరం ఉంది.
  • మిడిలార్డర్లో రాహుల్‌, హార్దిక్‌, జడేజా ఎంతో కీలకం.
  • పిచ్​పై స్పిన్నర్లు హవా ఉంటుంది. ఫామ్​లో ఉన్న స్పిన్నర్‌ వెల్లలాగేతో పాటు ఇతర స్పిన్నర్లు, పేసర్‌ పతిరనతో ముప్పు పొంచి ఉంది. గాయంతో ప్రధాన స్పిన్నర్‌ తీక్షణ ఫైనల్‌కు దూరమవ్వడం భారత్​కు కలిసొచ్చే విషయమైనా.. ధనంజయ డిసిల్వా, అసలంకల రూపంలో లంకకు మెరుగైన ప్రత్యామ్నాయాలున్నాయి.
  • Brace yourselves for an electrifying showdown that's set to make cricket history! India goes head to head with Sri Lanka in the Asia Cup 2023 Finals, and the excitement is off the charts! 🇮🇳🇱🇰#AsiaCup2023 #INDvSL pic.twitter.com/pwsLM49YKE

    — AsianCricketCouncil (@ACCMedia1) September 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తిలక్ ఉంటాడా?.. బంగ్లా మ్యాచ్‌తో వన్డే అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ కుర్రాడు తిలక్‌ వర్మ ఫైనల్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తన తొలి వన్డేలో 5 పరుగులే చేసినా.. అతడికి మరో అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌కు గాయం తిరగబెట్టడంతో అతడు వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. రాబోయే వరల్డ్ కప్​కు కూడా అనుమానమే. కాబట్టి అతడి స్థానాన్ని తిలక్‌తో భర్తీ చేయొచ్చు. తిలక్‌ను అవకాశమిస్తే.. ఇషాన్‌ను పక్కన పెట్టొచ్చు.

  • బంగ్లాతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న బుమ్రా, సిరాజ్‌, కుల్‌దీప్‌ తుది జట్టులోకి తిరిగి రానున్నారు. ఈ టోర్నీలో అంతగా ఆకట్టుకోని షమి, గాయాలతో ఇబ్బంది పడుతున్న అక్షర్‌ పటేల్‌ ఫైనల్లో ఆడే ఛాన్స్ లేదు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే వాషింగ్టన్‌ సుందర్‌.. లేదంటే శార్దూల్‌ ఠాకూర్‌ వస్తారు.
  • సూపర్‌ ఫామ్‌లో ఉన్న కుశాల్‌ మెండిస్‌తో పాటు నిశాంక, అసలంక, శానకల నుంచి భారత బౌలర్లకు ముప్పు ఉంది. కుశాల్‌ పెరీరా కూడా డేంజరే. కాబట్టి స్పిన్నర్‌ కుల్‌దీప్‌ మరోసారి విజృంభిస్తాడని అంతా ఆశిస్తున్నారు. పేస్‌ బౌలింగ్‌లో బుమ్రా, సిరాజ్‌ ఎంతో కీలకం. ఆరంభ ఓవర్లలో వీళ్లిద్దరూ వికెట్లు పడగొడితే.. ఆ తర్వాత కుల్‌దీప్‌ లాగించేస్తాడు.
  • ఈ పిచ్‌ స్పిన్నర్లదే. కాబట్టి పిచ్‌పై పరుగులు చేయడానికి చెమటోడ్చాల్సిందే.

తుది జట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), శుభ్‌మన్‌, కోహ్లి, రాహుల్‌, ఇషాన్‌/తిలక్‌, హార్దిక్‌, జడేజా, శార్దూల్‌/సుందర్‌, కుల్‌దీప్‌, బుమ్రా, సిరాజ్‌.

శ్రీలంక: నిశాంక, కుశాల్‌ పెరీరా, కుశాల్‌ మెండిస్‌, సమరవిక్రమ, అసలంక, శానక, ధనంజయ డిసిల్వా, వెల్లలాగె, హేమంత, రజిత, పతిరన.

  • వర్షం ముప్పు 50 శాతం ఉంది.. రిజర్వ్‌ డే కూడా ఉంది
  • భారత్‌ ఇప్పటివరకు 7 ఆసియాకప్‌లు గెలిచి.. ఈ మినీ టోర్నీలో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉంది. ఆ తర్వాత శ్రీలంక (6) రెండో స్థానంలో ఉంది.
  • ఈ టోర్నీలో పతిరన 11 వికెట్లతో నంబర్‌వన్​. కుల్‌దీప్‌, వెల్లలాగె పదేసి వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
  • ప్రస్తుత ఆసియాకప్‌లో శుభ్‌మన్‌ గిల్‌ 275 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

Ind Vs Ban Asia Cup Records : 1000కి పైగా పరుగులు.. ఏడాదిలో ఆరో సెంచరీ.. భారత్​-బంగ్లా మ్యాచ్ రికార్డ్స్​ ఇవే

Kohli Funny Run Viral Video : 'ఏంటీ కోహ్లీ అలా పరిగెడుతున్నావ్​?'.. ఒక్కసారిగా అంతా నవ్వులే నవ్వులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.