IND VS SL 952 runs : 1997 ఆగస్టు 2న కొలంబో వేదికగా శ్రీలంక- భారత్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఇందులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ఇండియా.. 36 పరుగుల వద్దే తొలి వికెట్‌ను కోల్పోయింది. అయితే ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్- నవజోత్ సిద్ధు కలిసి ఇన్నింగ్స్‌ను తమదైన శైలిలో ముందుకు తీసుకెళ్లారు. 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సిద్ధూ 111 పరుగులు చేయగా.. భారత్ స్కోర్ 183 వద్ద రెండో వికెట్‌గా పెవిలియన్ బాట పట్టాడు.
ind vs sl 1997 : రాహుల్ ద్రవిడ్ 197 బంతుల్లో 69 పరుగులు, కెప్టెన్ ఇన్నింగ్స్ 20 ఫోర్ల సాయంతో సచిన్ తెందుల్కర్ 143 పరుగులు చేశారు. రెండో సెంచరీని ఖాతాలో వేసుకుందామనుకున్న సచిన్.. మురళీధరన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా నిరాశగా వెనుదిరికాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన మహ్మద్ అజహరుద్దీన్ అద్భుతంగా రాణించాడు. 11 ఫోర్ల సాయంతో 126 పరుగులు చేశాడు. అయితే ఇతడు కూడా మురళీధరన్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యాడు.
అనంతరం గంగూలీ డకౌట్ అయ్యాడు. అనిల్ కుంబ్లే(27*) పోరాడేందుకు ప్రయత్నించినప్పటికీ... అతనికి సరైన సపోర్ట్ దొరకలేదు. ఇక రాజేశ్ చౌహాన్(23), అబే కురువిల్లా(9) కూడా జట్టు స్కోర్ పెంచేందుకు తమవంతు ప్రయత్నం చేశారు. అలా తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 167.3 ఓవర్లు ఆడిన టీమ్ఇండియా .. 8 వికెట్ల నష్టానికి 537 పరుగుల వద్ద మ్యాచ్‌ను డిక్లేర్ చేసింది.
ind vs sl test 952 scorecard : అయితే రెండో రోజు బ్యాటింగ్ చేసిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 39 పరుగుల వద్ద మర్వన్ ఆటపట్టు(26) కులకర్ణి బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. కానీ మూడో రోజు ఆట స్వరూపమే మారిపోయింది. 39 పరుగులకు ఓ వికెట్ కోల్పోయిన లంక రెండో వికెట్ నష్టానికి ఏకంగా 615 పరుగులు చేసింది. రోషన్ మహనమ 27 ఫోర్లతో 225 డబుల్ సెంచరీ చేశాడు. సనత్ జయసూర్యా 36 ఫోర్లు, 2 సిక్సర్లతో 340 పరుగులు చేశాడు. ఆ తర్వాత వచ్చిన డి సిల్వ(126), అర్జున రణతుంగ(86), మహేళ జయవర్దనే(66), కలువితరణ(14*), చమిందా వాస్(11*) కూడా రఫ్పాడించారు. బౌలింగ్ విషయానికి వస్తే.. టీమిండియాలో ఏ బౌలర్ ని శ్రీలంక ఆటగాళ్లు వదల్లేదు.
టీమ్ఇండియా బౌలర్లలో 78 ఓవర్లు వేసిన రాజేశ్ చౌహాన్ 276 పరుగులు సమర్పించుకున్నాడు. అనీల్ కుంబ్లే అయితే 72 ఓవర్లు వేసి 223 పరుగులు, 70 ఓవర్ల వేసిన నీలేశ్ కులకర్ణి 195 పరుగులు ఇచ్చారు. ఈ ముగ్గురు కేవలం ఒక్కో వికెట్ మాత్రమే దక్కించుకున్నారు. గంగూలీ 9 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి 2 వికెట్లు దక్కించుకున్నాడు. ఐదు రోజుల ఆట ముగిసే సరికి 271 ఓవర్లు ఆడి ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 952 పరుగులు చేసింది లంక. టెస్టుల్లో 400 పరుగులు చేస్తేనే గొప్ప అనుకుంటున్న సమయంలో టీమ్ఇండియా 537 పరుగులకు డిక్లేర్ చేస్తే.. శ్రీలంక 952 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఫైనల్‌గా ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.
Rohit sharma retirement news : 'అప్పటి వరకు ఆడాలని అనుకుంటున్నాను'
Ind Vs WI T20 : టీమ్ఇండియా @200.. టీ20ల్లో మన స్టార్ ప్లేయర్ల రికార్డులు తెలుసా?