IND vs SL 3rd T20: శ్రీలంకతో జరిగిన మూడో టీ20లోనూ టీమ్ఇండియా విజయం సాధించింది. ఇప్పటికే సిరీస్ దక్కించుకున్న భారత్ ఈ విజయంతో శ్రీలంకను క్లీన్‌స్వీప్ చేసింది. యువక్రికెటర్ శ్రేయస్ అయ్యర్ దూకుడుగా ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన శ్రేయస్.. 45 బంతుల్లో 73 పరుగులు చేశాడు. మరోవైపు జడేజా కూడా చక్కని భాగస్వామ్యం అందించడం వల్ల 16.5 ఓవర్లలోనే 147 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా ఛేదించింది.
శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్‌లో వరుసగా మూడు హాఫ్‌సెంచరీలు (57*, 74*, 73*) సహా మొత్తంగా 204 పరుగులు చేశాడు.
టీమ్ఇండియా రికార్డు..
ఈ విజయంతో రోహిత్ సేన అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన అఫ్గానిస్థాన్ జట్టు సరసన చేరింది. అఫ్గాన్.. వరుసగా 12 టీ20ల్లో గెలిచింది.
ఇదీ చూడండి : ఆ రెండు జట్ల మధ్యే ఐపీఎల్ తొలి మ్యాచ్.. ప్రేక్షకులకు ఓకే!