IND VS SA TOUR 2021: బీసీసీఐ 90వ సర్వసభ్య సమావేశం శనివారం (డిసెంబర్ 4) జరగనుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. అందులో భాగంగా టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనపై చర్చ జరగనుందని సమాచారం. బీసీసీఐ అజెండాలో ఈ అంశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో ద్వైపాక్షిక సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు వెళ్లాలా? వద్దా? అనే దానిపై ఈ సమావేశంలో చర్చించి.. తుది నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళన మొదలైంది. ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని నివేదికలు తెలుపుతున్న క్రమంలో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇదిలా ఉంటే.. వైరస్ వ్యాప్తి కారణంగా దేశవాళీ ఆటలను దక్షిణాఫ్రికా ఇప్పటికే రద్దు చేసింది.
ఇదీ చదవండి: IND vs SA Series: సందిగ్ధంలో పుజారా, రహానే కెరీర్.. ఆ సిరీస్‌పైనే ఆశలు!