భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ నిర్ణయాత్మక మూడో టెస్టు మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన భారత జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. సఫారీలకు బౌలింగ్ అప్పగించింది. వెన్ను నొప్పి కారణంగా రెండో టెస్టుకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఈ టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో తలో మ్యాచ్‌లో విజయం సాధించి ఇరు జట్లు 1-1తో సిరీస్‌ను సమం చేశాయి. దీంతో మూడో టెస్టు రసవత్తరంగా సాగనుంది. పై చేయి సాధించే జట్టుకే సిరీస్ సొంతం అవుతుంది. రెండో టెస్టులో గాయపడిన మహమ్మద్ సిరాజ్ స్థానంలో సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు.
భారత జట్టు
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానె, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్
దక్షిణాఫ్రికా జట్టు
డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఐడెన్ మర్క్రమ్, కీగన్ పీటర్సన్, రస్సీ వాండర్ డస్సెన్, తెంబా బవుమా, కైల్ వెరీన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కగిసో రబాడ, కేశవ్ మహరాజ్, ఒలివర్, లుంగి ఎంగిడి