ETV Bharat / sports

IND VS SA: ఓపెనర్లుగా వారిద్దరు​​.. ఆరో బౌలర్​గా ఆ ప్లేయర్​కు ఛాన్స్​

IND VS SA First ODI: సఫారీలతో జరగనున్న తొలివన్డేకు సంబంధించిన తుదిజట్టు కూర్పు వివరాలను తెలిపాడు కెప్టెన్​ కేఎల్​ రాహుల్​. గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న శిఖర్​ ధావన్, చాహల్​కు జట్టులో అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు.

rahul dhawan
రాహుల్​, ధావన్​
author img

By

Published : Jan 18, 2022, 9:59 PM IST

IND VS SA First ODI: దక్షిణాఫ్రికాతో బుధవారం జరగనున్న తొలి వన్డే మ్యాచ్​కు సంబంధించిన తుదిజట్టు కూర్పు వివరాలను కెప్టెన్​ కేఎల్​ రాహుల్​ తెలిపాడు. పేలవ ఫామ్​తో జట్టుకు దూరమైన శిఖర్​ ధావన్​కు అవకాశం కల్పించాడు రాహుల్​. జట్టులో రోహిత్​ శర్మ లేకపోవడం వల్ల ధావన్​కు జోడీగా మరో ఓపెనర్​గా తాను ఆడనున్నట్లు స్పష్టం చేశాడు.

"ధావన్​ చాలా అనుభవం ఉన్న ఓపెనర్​. అతడి నుంచి జట్టు ఏం ఆశిస్తుందో అతను అర్థం చేసుకోవాలి. కెప్టెన్​గా అతిడికి సపోర్ట్​ ఇచ్చి.. భారత జట్టు మెరుగైన స్కోరు చేసేందుకు సహాయపడతా" అని రాహుల్​ అన్నాడు.

బోలాండ్​ పార్క్​ మైదానం స్పిన్​కు అనుకూలం కావడం వల్ల అశ్విన్​-చాహల్​ ద్వయం కీలక పాత్ర పోషిస్తారని అభిప్రాయపడ్డాడు. వారిద్దరూ తొలి రెండు మ్యాచుల్లో ఆడతారని అన్నాడు. దీంతో గతకొంత కాలంగా జట్టుకు దూరంగా ఉన్న చాహల్​కు మరోసారి అవకాశం లభించినట్లు అయింది.

ఆరో బౌలర్​గా అయ్యర్​..

ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యా గైర్హాజరు వల్ల జట్టులో ఆరో బౌలర్​గా వెంకటేశ్​ అయ్యర్​కు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు కేఎల్​ రాహుల్​ పేర్కొన్నాడు. గతేడాది జరిగిన ఐపీఎల్​, న్యూజిలాండ్​ టీ20 సిరీస్​లలో వెంకటేశ్​ మెరుగైన ప్రదర్శన చేశాడని చెప్పుకొచ్చాడు. జట్టులో ఫాస్ట్​ బౌలింగ్​ ఆల్​రౌండర్లు కీలక పాత్ర పోషిస్తారని.. ఇది పరిగణించే అయ్యర్​ను ఎంపిక చేసినట్లు తెలిపాడు.

జట్టుకు దూరంగా ఉన్న శిఖర్​ ధావన్​, చాహల్​.. ఈ సారి మెరుగైన ప్రదర్శన చేసి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారని ఆశిస్తున్నట్లు కేఎల్​ రాహుల్​ వ్యాఖ్యానించాడు.

గత కొంతకాలంగా మెరగైన ప్రదర్శన చేస్తూ వచ్చిన రుతురాజ్​ గైక్వాడ్​కు ఈసారి కూడా తుది జట్టులో స్థానం లభించలేదు.

ఇదీ చూడండి: సఫారీలతో సమరానికి టీమ్​ఇండియా సై .. అందరి కళ్లూ కోహ్లీపైనే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.