ETV Bharat / sports

IND vs SA: 'హార్దిక్‌ లేని లోటును శార్దూల్‌ భర్తీ చేస్తున్నాడు' - హార్దిక్ పాండ్య ఆల్​రౌండర్

IND vs SA: టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య లేని లోటును శార్దూల్ ఠాకూర్ భర్తీ చేస్తున్నాడని భారత మాజీ ఆటగాడు, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. ఆల్‌రౌండర్‌ స్థానం విషయమై పాండ్య, శార్దూల్‌ను పోలుస్తూ పలు వ్యాఖ్యలు చేశాడు.

hardik, shardul
హార్దిక్ పాండ్య, శార్దూల్
author img

By

Published : Jan 6, 2022, 5:00 PM IST

IND vs SA: హార్దిక్‌ పాండ్య నుంచి టీమ్‌ఇండియా ఆశించిన దాన్ని శార్దూల్‌ ఠాకూర్‌ నెరవేరుస్తున్నాడని మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శార్దూల్‌ ఏడు వికెట్లతో చెలరేగాడు. దీంతో కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడమే కాకుండా బ్యాటింగ్‌లోనూ 28 పరుగులు సాధించి ఆకట్టుకున్నాడు. దీని గురించి ఆకాశ్‌ స్పందించాడు. ఆల్‌రౌండర్‌ స్థానం విషయమై హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోలుస్తూ మాట్లాడాడు.

"బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్య, శార్దూల్‌ ఠాకూర్‌ను పోల్చడం సరికాదు. బ్యాటింగ్‌ పరంగా చూస్తే పాండ్య చాలా ముందున్నాడు. పాండ్య భారీ పరుగులు చేయగలడు. ఇక బౌలింగ్‌లో హార్దిక్‌ కన్నా శార్దూల్‌ మెరుగ్గా ఉన్నాడు. మ్యాచ్‌లో కీలక వికెట్లు పడగొడుతున్నాడు. శార్దూల్‌ రెండో టెస్టులో చేసిన ప్రదర్శన అత్యద్భుతం. ఏడు వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌ 24 బంతుల్లో 28 పరుగులు చేశాడు. అయితే, ఆ పరుగులు ఎంత విలువైనవో బుధవారం గుర్తించకపోయి ఉండొచ్చు. కానీ, గురువారం వాటి విలువ తెలుస్తుంది. ఎందుకంటే దక్షిణాఫ్రికా విజయానికి ఇంకా 122 పరుగులే కావాలి. ఒకవేళ శార్దూల్‌ ఆ పరుగులు చేయకపోయుంటే నేడు దక్షిణాఫ్రికా లక్ష్యం మరింత తక్కువగా ఉండేది. విహారితో కలిసి ఏడో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పకపోయి ఉంటే టీమ్‌ఇండియా ఈపాటికే ఇబ్బందికర పరిస్థితుల్లో నిలిచేది."

--ఆకాశ్ చోప్రా, వ్యాఖ్యాత.

మ్యాచ్​ విషయానికొస్తే రెండో టెస్టులో భారత్​పై అధిక్యంలో ఉంది దక్షిణాఫ్రికా. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. భారత్​పై విజయం సాధించడానికి ప్రోటీస్​ జట్టు ఇంకా 122 పరుగులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం క్రీజులో ఎల్గర్(46), వాండర్ డసెన్(11) ఉన్నారు. అయితే.. వర్షం కారణంగా నాలుగో రోజు మ్యాచ్​కు అంతరాయం ఏర్పడింది.

ఇదీ చదవండి:

IND Vs SA: పంత్​పై గంభీర్​ ఫైర్​

శార్దూల్​కు 'లార్డ్' అనే నిక్ నేమ్ ఎలా వచ్చిందంటే?

ఏడు కాదు అంతకన్నా ఎక్కువ వికెట్లే తీస్తా: శార్దూల్​ ఠాకూర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.